Kethireddy Pedda Reddy: తాడిపత్రిలో మరోసారి హైటెన్షన్.. మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత పెద్దారెడ్డి ఇంటి సమీపంలో రాళ్లు..!

తాడిపత్రిలో ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. స్థానికులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు.

Kethireddy Pedda Reddy: తాడిపత్రిలో మరోసారి హైటెన్షన్.. మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత పెద్దారెడ్డి ఇంటి సమీపంలో రాళ్లు..!

Jc Prabhakar Reddy and Kethireddy Pedda Reddy

Updated On : May 2, 2025 / 4:51 PM IST

Kethireddy Pedda Reddy: అనంతపురం జిల్లా తాడిపత్రిలో మరోసారి హైటెన్షన్ వాతావరణం నెలకొంది. మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత కేతిరెడ్డి పెద్దారెడ్డి రాక నేపథ్యంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గత 10 నెలలుగా మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డిని తాడిపత్రిలోకి అడుగుపెట్టనివ్వలేదు టీడీపీ సీనియర్ నేత, మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి. చాలాసార్లు తాడిపత్రికి వెళ్లేందుకు మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి ప్రయత్నించారు. అయితే, శాంతి భద్రతలు అదుపు తప్పుతాయని పెద్దారెడ్డికి పోలీసులు అడ్డు చెప్పారు.

దాంతో తాడిపత్రికి వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలంటూ హైకోర్టును ఆశ్రయించారు మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి. కోర్టులో ఆయనకు ఊరట లభించింది. పెద్దారెడ్డి తాడిపత్రికి వెళ్లేందుకు పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో తాడిపత్రికి వెళ్లేందుకు పెద్దారెడ్డి సిద్ధమవుతున్నారు.

అయితే, పెద్దారెడ్డి ఇంటికి సమీపంలో రాళ్లను సిద్ధం చేస్తున్నారు ప్రత్యర్థులు. కాలేజీ గ్రౌండ్ లో టిప్పర్లతో రాళ్ల లోడ్లు దించారు. రాళ్లను అక్కడి నుంచి తీసివేయించేందుకు పోలీసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాడిపత్రిలో ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. స్థానికులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు.

Also Read: క్రైస్తవ మతంలోకి మారినరోజే ఎస్సీ హోదా కోల్పోతారు.. ఆ చట్టం నుంచికూడా రక్షణ పొందలేరు.. ఏపీ హైకోర్టు కీలక తీర్పు

అసెంబ్లీ ఎన్నికల సమయంలో తాడిపత్రిలో అల్లర్ల జరిగాయి. ఈ క్రమంలో తాడిపత్రికి వెళ్లేందుకు పెద్దారెడ్డికి పోలీసులు పర్మిషన్ ఇవ్వడం లేదు. తాడిపత్రిలోకి వెళ్లకుండా పోలీసులు తనను అడ్డుకుంటున్నారని.. జేసీ ప్రభాకర్ రెడ్డి, టీడీపీ కార్యకర్తలు తన ఇంటిపై దాడికి పాల్పడ్డారని పెద్దారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన న్యాయస్థానం తాడిపత్రి వెళ్ళేందుకు కేతిరెడ్డికి షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది.

తాడిపత్రికి పదుల సంఖ్యలో వాహనాలతో ర్యాలీగా వెళ్లకూడదని కోర్టు షరతు పెట్టింది. 5 వాహనాల్లో మాత్రమే వెళ్ళాలంది. తాడిపత్రికి వెళ్లేందుకు కేతిరెడ్డికి తగిన భద్రత కల్పించాలని న్యాయస్థానం ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలతో కేతిరెడ్డి పెద్దారెడ్డి జిల్లా ఎస్పీ జగదీశ్ ను కలిసి తాడిపత్రి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. తాడిపత్రికి వెళ్లేందుకు పెద్దారెడ్డి సిద్ధమవుతున్న తరుణంలో తాడిపత్రిలో మళ్లీ హైటెన్షన్ వాతావరణం నెలకొంది. అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.