ఏపీలో కొత్త మద్యం పాలసీకి హైకోర్టు బ్రేక్
ఏపీలో కొత్త మద్యం పాలసీకి తాత్కాలిక బ్రేక్ పడింది. జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త లిక్కర్ పాలసీపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త బార్లకు లాటరీ నిలిపివేస్తూ

ఏపీలో కొత్త మద్యం పాలసీకి తాత్కాలిక బ్రేక్ పడింది. జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త లిక్కర్ పాలసీపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త బార్లకు లాటరీ నిలిపివేస్తూ
ఏపీలో కొత్త మద్యం పాలసీకి తాత్కాలిక బ్రేక్ పడింది. జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త లిక్కర్ పాలసీపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త బార్లకు లాటరీ నిలిపివేస్తూ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన మద్యం పాలసీని సవాల్ చేస్తూ బార్ల యజమానులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై సోమవారం(డిసెంబర్ 23,2019) విచారించిన కోర్టు.. యథాతథ స్థితిని కొనసాగించాలని ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను 6 వారాలకు వాయిదా వేసింది.
ఏపీలో సంపూర్ణ మద్యపాన నిషేదం దిశగా అడుగులు వేస్తున్న జగన్ ప్రభుత్వం ఆ దిశగా ఇప్పటికే పలు చర్యలు తీసుకుంది. కొత్త లిక్కర్ పాలసీ తీసుకొచ్చింది. 20 శాతం మద్యం దుకాణాలను తగ్గించింది. మద్యం షాపుల సంఖ్యను తగ్గించింది. ప్రభుత్వమే మద్యం షాపులు నిర్వహిస్తోంది. మద్యం విక్రయాల సమయాన్ని కూడా కుదించింది. మద్యం ధరలను పెంచింది.
అంతేకాదు.. మూడు పువ్వులు.. ఆరు కాయలుగా సాగుతున్న బార్ల వ్యాపారానికి సైతం జగన్ సర్కార్ షాక్ ఇచ్చింది. 40 శాతం మేర బార్లు తగ్గించాలని నిర్ణయం తీసుకుంది. 2020 జనవరి 1 నుంచి బార్లకు సంబంధించిన నూతన విధానం అమలు చేస్తూ జీవో జారీ చేసింది. బార్లకు లైసెన్స్ గడువు 2022 సంవత్సరం జూన్ వరకు ఉన్నా ఏపీ ఎక్సైజ్ చట్టం 1968లోని సెక్షన్ 32 ప్రకారం బార్ లైసెన్సులను వాపసు తీసుకుంటున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. దీంతో 2019 డిసెంబర్ 31కే బార్ల లైసెన్సులు రద్దు కానున్నాయి. దీన్ని సవాల్ చేస్తూ బార్ల యజమానులు హైకోర్టుని ఆశ్రయించారు.