అమరావతికి అమిత్ షా.. చంద్రబాబు నివాసంలో కీలక సమావేశం

ఢిల్లీ నుంచి రాత్రి 9 గంటల 30 నిమిషాలకు గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకోనున్నారు అమిత్ షా.

అమరావతికి అమిత్ షా.. చంద్రబాబు నివాసంలో కీలక సమావేశం

Amit Shah : కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. ఇవాళ రాత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నివాసానికి రానున్నారు. రేపటి చంద్రబాబు ప్రమాణస్వీకారంలో పాల్గొనడానికి ఒక రోజు ముందే అమరావతి వస్తున్న అమిత్ షా.. ఈరోజు రాత్రి 10 గంటలకు చంద్రబాబును కలవనున్నారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో ఇరువురు నేతల భేటీ జరగనుంది.

ఢిల్లీ నుంచి రాత్రి 9 గంటల 30 నిమిషాలకు గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకోనున్నారు అమిత్ షా. అక్కడి నుంచి నేరుగా చంద్రబాబు నివాసానికి వెళ్తారు. చంద్రబాబుతో భేటీ అనంతరం 11 గంటల 20 నిమిషాలకు నోవాటెల్ హోటల్ లో రాత్రికి బస చేస్తారు. రేపు (జూన్ 12) ఉదయం నోవాటెల్ నుంచి బయలుదేరి కేసరపల్లిలో జరిగే చంద్రబాబు ప్రమాణస్వీకార కార్యక్రమానికి అమిత్ షా హాజరవుతారు.

చంద్రబాబు ప్రమాణస్వీకార కార్యక్రమానికి సంబంధించి కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటన ఖరారైంది. సరిగ్గా రాత్రి 9 గంటల 35 నిమిషాలకు అమిత్ షా గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా చంద్రబాబు నివాసానికి వెళ్తారు. ఎన్డీయే శాసనసభా పక్ష నేతగా చంద్రబాబు ఎన్నికైన నేపథ్యంలో అమిత్ షా నేరుగా ఆయన ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు తెలపనున్నారు. అటు అమిత్ షాను చంద్రబాబు డిన్నర్ కు ఆహ్వానించినట్లు సమాచారం. దాదాపు 40 నిమిషాల పాటు ఇరువురు నేతలు భేటీ కానున్నారు. ఈ భేటీలో కీలక అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

ప్రధానంగా మంత్రివర్గ కూర్పునకు సంబంధించి చర్చించే అవకాశం ఉంది. కేబినెట్ లో అటు జనసేనకు, ఇటు బీజేపీకి ఎన్ని సీట్లు కేటాయిస్తారు? ఎంతమందికి మంత్రి పదవులు ఇచ్చే అవకాశం ఉంది? ఈ అంశాలపై చంద్రబాబు అమిత్ షాకు వివరించే అవకాశం ఉంది. బీజేపీకి రెండు మంత్రి పదవులు దక్కే అవకాశం కనిపిస్తోంది. దీనికి సంబంధించి చంద్రబాబు షాకు వివరించే ఛాన్స్ ఉంది.

రేపు ఉదయం 10.30 గంటలకు నోవాటెల్ నుంచి నేరుగా చంద్రబాబు ప్రమాణస్వీకారం కార్యక్రమానికి అమిత్ షా హాజరవబోతున్నారు. అటు ప్రధాని నరేంద్ర మోదీ సైతం ప్రమాణస్వీకార కార్యక్రమానికి రాబోతున్నారు. ఉదయం 10 గంటల 40 నిమిషాలకు గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా సభాస్థలికి వెళ్తారు. దాదాపు 11 గంటల నుంచి 12 గంటల 30 నిమిషాల వరకు ప్రధాని నరేంద్ర మోదీ సభలో పాల్గొనబోతున్నారు. రాజధాని, ఇతర అంశాల గురించి ప్రధాని మోదీ ఒక ప్రకటన చేసే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది. ఏపీకి ఏం చేయబోతున్నారు? అనే దానిపై క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

Also Read : చంద్రబాబు చేతిలో చెయ్యేసి పవన్ కల్యాణ్ భావోద్వేగ ప్రసంగం ..