Visakha Central Jail : విశాఖ సెంట్రల్ జైల్లో హోంమంత్రి అనిత తనిఖీలు.. జైల్లో ఆ మొక్క చూసి షాక్..

ఇదే జైల్లో ఏళ్లకు ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులను కూడా బదిలీ చేస్తామన్నారు.

Visakha Central Jail : విశాఖ సెంట్రల్ జైల్లో హోంమంత్రి అనిత తనిఖీలు.. జైల్లో ఆ మొక్క చూసి షాక్..

Updated On : January 5, 2025 / 7:47 PM IST

Visakha Central Jail : విశాఖ సెంట్రల్ జైలుకి వెళ్లిన హోంమంత్రి అనిత ఒక్కసారిగా అవాక్కయ్యారు. జైల్లో అడుగు పెట్టగానే హోంమంత్రి అనితకు ఏకంగా గంజాయి మొక్క స్వాగతం పలికింది. గంజాయి మొక్కను చూసి హోంమంత్రి కంగుతిన్నారు. ఇక్కడికి గంజాయి మొక్క ఎలా వచ్చిందని జైలు అధికారులను గట్టిగా నిలదీశారు.

జైల్లో సెల్ ఫోన్ల వినియోగం, గంజాయి సరఫరా..!
విశాఖ సెంట్రల్ జైల్లో ఫోన్ కనిపించిందన్న ఆరోపణలు వస్తుండటంతో స్వయంగా హోంమంత్రి రంగంలోకి దిగారు. జైల్లో తనిఖీలు చేశారు. జైల్లో తిరుగుతున్న సమయంలో హోంమంత్రి అనితకు ఒక గంజాయి మొక్క కనిపించింది. విశాఖ జైల్లో గంజాయి సరఫరా జరుగుతోందనే ప్రచారానికి ఈ గంజాయి మొక్క ఇప్పుడు సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది. జైల్లో గంజాయి సరఫరాపై విచారణ జరుగుతోందన్నారు హోంమంత్రి అనిత.

Also Read : బీజేపీ మహిళా నేత మాధవీ లతకు క్షమాపణలు చెప్పిన జేసీ ప్రభాకర్ రెడ్డి

జైలు సిబ్బందికి మంత్రి సీరియస్ వార్నింగ్..
గంజాయి సప్లయ్ వెనక జైలు సిబ్బంది ప్రమేయం ఉంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. జైల్లో జరుగుతున్న ఘటనలపై కమిటీ వేశామన్నారు. ఈ కమిటీ నివేదిక రాగానే బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. ఇదే జైల్లో ఏళ్లకు ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులను కూడా బదిలీ చేస్తామన్నారు.

Visakhapatnam Central Prison

మరోవైపు విశాఖ సెంట్రల్ జైల్లో సెల్ ఫోన్ కనిపించడంపై కూడా హోంమంత్రి అనిత సీరియస్ అయ్యారు. ఏ ఖైదీ సెల్ ఫోన్ వినియోగించాడు, ఎవరికి ఫోన్ చేశారు అనేదానిపై ఎంక్వైరీ చేస్తున్నామన్నారు. ఎవరికైతే ఫోన్ చేశారో అవతలి వ్యక్తి కూడా కోర్టుకు రాక తప్పదన్నారు హోంమంత్రి అనిత.

తప్పు చేసిన వారిని వదిలేది లేదు- హోంమంత్రి అనిత
‘చాలా షాకింగ్ న్యూస్ ఏంటంటే.. జైల్లో సెల్ ఫోన్లు బయటపడ్డాయి. సెల్ ఫోన్లు కూడా యూజ్ చేసే పరిస్థితి వచ్చినప్పుడు మేము కచ్చితంగా ఎంక్వైరీ చేసుకోవాలి. ఎవరైనా తప్పు చేసినట్లు తేలితే వారికి పనిష్ మెంట్ ఇవ్వాల్సిందే. జైల్లో పని చేసే ఉద్యోగులు తమ విధులను సక్రమంగా నిర్వహించాలి. ఇప్పుడు సెల్ ఫోన్లు దొరికాయి. వాటిని ఎవరు వాడారు? ఎవరితో మాట్లాడారు? ఇవన్నీ తెలుసుకుంటాం.

జైల్లో ఉన్న వారితో మాట్లాడిన బయటి వ్యక్తులు కూడా రేపు కోర్టుకు హాజరయ్యే పరిస్థితి వస్తుంది. వారు కూడా తప్పు చేసిన వారవుతారు. జైల్లో గంజాయి మొక్క కూడా కనిపించింది. మేము చాలా క్లియర్ గా ఎంక్వైరీ చేస్తున్నాం. ఎక్కడ ఏ పొరపాటు జరిగినా ఎవరినీ ఉపేక్షించే పరిస్థితి లేదు.

 

Also Read : విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై మంత్రి నారా లోకేశ్ కీలక వ్యాఖ్యలు