KA Paul : నేను తలుచుకుంటే.. పులివెందులలో కూడా జగన్ గెలవకుండా చేయగలను, పవన్ కల్యాణ్‌ను సీఎంను చేస్తా- కేఏ పాల్ సంచలనం

అదానీ నేరుగా ముఖ్యమంత్రి జగన్ కి కాల్ చేసి నా దీక్షను భగ్నం చేయించారనే అనుమానాలున్నాయి? KA Paul - CM Jagan

KA Paul : నేను తలుచుకుంటే.. పులివెందులలో కూడా జగన్ గెలవకుండా చేయగలను, పవన్ కల్యాణ్‌ను సీఎంను చేస్తా- కేఏ పాల్ సంచలనం

KA Paul - CM Jagan (Photo : Google)

Updated On : August 30, 2023 / 9:21 PM IST

KA Paul – CM Jagan : ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కాక మీదున్నారు. భారీ డైలాగులు పేలుస్తున్నారు. ఏకంగా సీఎం జగన్ నే టార్గెట్ చేశారు. తన మాటలతో ఏపీ రాజకీయాల్లో మంటలు పుట్టిస్తున్నారు. నేను తలుచుకుంటే.. పులివెందులలో కూడా జగన్ గెలవకుండా చేయగలను అని కేఏ పాల్ అన్నారు. అంతేకాదు వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఒక్క సీటు కూడా గెలవకుండా చేయగలను అని పాల్ చెప్పారు.

విశాఖలో కేఏ పాల్ మాట్లాడారు. ”విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తుండగా డాక్టర్లు పరీక్షలు జరిపి నా ఆరోగ్యం బాగానే ఉందని చెప్పారు. కానీ త్రీటౌన్ సీఐ 20 మంది పోలీసులతో వచ్చి నా దీక్ష భగ్నం చేశారు. నా కాలు విరగ్గొట్టారు.‌ ఆసుపత్రిలో నాకు సైనైడ్ లేదా లేదా మత్తుమందో ఇవ్వాలని చూశారు. ప్రజాస్వామ్యవాదులు నాపై జరిగిన దాడిని ఖండించాలి.

Also Read..Dadi Veerabhadra Rao: దాడి వాడి ఎందుకు తగ్గిపోయింది.. మళ్లీ యాక్టివ్ అవుతారా?

అదానీ నేరుగా ముఖ్యమంత్రి జగన్ కి కాల్ చేసి నా దీక్షను భగ్నం చేయించారనే అనుమానాలున్నాయి? జగన్.. మీరు అదానీ తొత్తు కాదని నిరూపించుకోవాలి. ఒరేయ్ జగన్ అని అనిపించుకోవద్దు. నన్ను ఎన్ కౌంటర్ చేయిస్తారట. నన్ను ఎత్తుకెళ్లడానికి హక్కు ఎక్కడుంది? నాపై దాడికి పాల్పడ్డ సీఐ రామారావు, ఎస్ఐని 24గంటల్లో సస్పెండ్ చేయండి. లేదంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. రాబోయే ఎన్నికల్లో వైసీపీ ఒక్క సీటు కూడా గెలవకుండా చేస్తాను‌. పులివెందుల్లో కూడా జగన్ గెలవకుండా చేయగలను.

Also Read..Minister Roja: రోజాకు ఆ ఐదుగురితో విభేదాలు.. వారికి మంత్రి పెద్దిరెడ్డి అండదండలు!

ఏపీ ఎంపీలు అందరూ రాజీనామా చేయాలి. అలా చేస్తే 30 రోజుల్లో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపిస్తాను. ప్రజాశాంతి పార్టీ తరపున పవన్ కల్యాణ్ కు ముఖ్యమంత్రి పదవి ఆఫర్ ఇస్తున్నా. పవన్, నాతో కలిసి పోటీ చెయ్యి. ప్యాకేజీలకు ఆశపడొద్దు. విశాఖ ఎంపీగా నేను పోటీ చేస్తాను. నేను స్ధానికుడిని. నాకు స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల ఓట్లే 2 లక్షల వరకూ వస్తాయి” అని సంచలన వ్యాఖ్యలు చేశారు కేఏ పాల్.