Ayyanna Patrudu : లోకేశ్‌ను అరెస్ట్ చేస్తే.. ఆమెను ముందు పెట్టి పార్టీ నడిపిస్తాం- అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు

తెలుగుదేశం పార్టీ పెట్టిన ముహూర్తం చాలా గొప్పది. సంక్షోభాలు టీడీపీకి కొత్త కాదు. పార్టీ నాయకత్వానికి ఎలాంటి ఢోకా లేదు. Ayyanna Patrudu

Ayyanna Patrudu : లోకేశ్‌ను అరెస్ట్ చేస్తే.. ఆమెను ముందు పెట్టి పార్టీ నడిపిస్తాం- అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు

Ayyanna Patrudu - Nara Lokesh

Ayyanna Patrudu – Nara Lokesh : టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నారా లోకేశ్ ను అరెస్ట్ చేస్తే ఆయన సతీమణి బ్రాహ్మణిని ముందుపెట్టి తెలుగుదేశం పార్టీని నడిపిస్తామన్నారు. ఢిల్లీలో నేతలందరం కలిసినప్పుడు ఈ అంశం చర్చకు వచ్చిందన్నారు. ఒకవేళ ఆ సందర్భం వస్తే బ్రాహ్మణితో ముందుకెళ్తామన్నారాయన. టీడీపీకి సంక్షోభాలు కొత్త కాదన్న అయ్యన్నపాత్రుడు ఎంతమందిపై కేసులు పెట్టినా ఎదుర్కొనేందుకు సిద్ధమని వెల్లడించారు.

ఢిల్లీలో చోటు చేసుకున్న పరిణామాలను మీడియాకు వివరించారు అయ్యన్నపాత్రుడు. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ” చంద్రబాబు తర్వాత లోకేశ్ ను అరెస్ట్ చేస్తారంటూ వస్తున్న వార్తలపై మొన్న ఢిల్లీలో చర్చించాం. పార్టీ నాయకత్వానికి ఎలాంటి ఢోకా లేదు. లోకేశ్ ను అరెస్ట్ చేస్తే నారా బ్రాహ్మణిని ముందు పెట్టి పార్టీని నడిపిస్తాం. ఈ అంశంపై మొన్న ఢిల్లీలో నేతలు కూర్చున్నప్పుడు చర్చ జరిగింది. తెలుగుదేశం పార్టీ పెట్టిన ముహూర్తం చాలా గొప్పది. సంక్షోభాలు టీడీపీకి కొత్త కాదు” అని అయ్యన్నపాత్రుడు అన్నారు.(Ayyanna Patrudu)

Also Read: జనసేనాని డైరెక్షన్‌.. వచ్చే ఎన్నికలకు పవన్ కళ్యాణ్ సరికొత్త రూట్ మ్యాప్!

అందరినీ లోపలేయమని జగన్ చెబుతున్నారు- వర్ల రామయ్య
మరో టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య.. సీఎం జగన్ పై పైర్ అయ్యారు. చంద్రబాబుని అరెస్ట్ చేసిన అధికారులని వాటేసుకుని ముఖ్యమంత్రి జగన్ అభినందించారని, నా కోరిక నెరవేరిందని వారందరికీ స్వీట్స్ పంచారని చెప్పారు. ”లండన్ నుంచి గన్నవరంలో దిగాక విజయగర్వంతో నేలను ముద్దాడారు. వినాశకాలే విపరీత బుద్ది అన్నట్లే సీఎం జగన్ వ్యవహారం ఉంది.

మీ కేబినెట్ మంత్రి విడదల రజనీ సైతం మీరు సైబరాబాద్ లో నాటిన మొక్కను సార్ అని చంద్రబాబుకి చెప్పారు. ఈ అరెస్ట్ తో మీ అవినీతిని కప్పిపుచ్చలేరు. వెకిలి మహిళా మంత్రి పర పురుషుల నోట్లో స్వీట్లు కుక్కుతుంది. నేను ఎంతకాలం ఉంటానో నాకే తెలియదు. అందర్నీ లోపలవేయమని ముఖ్యమంత్రి జగన్ అధికారులతో చెబుతున్నారు” అని వర్ల రామయ్య ఆరోపించారు.(Ayyanna Patrudu)

Also Read: చంద్రబాబు అరెస్ట్‌తో రాజకీయాల్లోకి నారా బ్రాహ్మణి..? పార్టీ కష్టాల్లో ఉండటంతో బాధ్యతలు తీసుకునేందుకు సిద్ధం

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చుట్టూ కేసుల ఉచ్చు బిగిస్తోంది జగన్ సర్కార్. వరుస కేసులతో చంద్రబాబును ఉక్కిరిబిక్కిరి చేసే ప్లాన్ లో ఉంది ప్రభుత్వం. చంద్రబాబుపై సీఐడీ మూడు కేసులు నమోదు చేసింది. స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో చంద్రబాబు అరెస్ట్ అవగా, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో పీటీ వారెంట్ దాఖలు చేసింది. ఆ తర్వాత ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబును నిందితుడిగా పేర్కొంటూ ఏసీబీ కోర్టులో పీటీ వారెంట్ దాఖలు చేసింది సీఐడీ. ఇలా వరుస కేసులతో చంద్రబాబుని రౌండప్ చేసింది.

ఇదిలా ఉంటే.. చంద్రబాబు తనయుడు నారా లోకేష్ ను కూడా అరెస్ట్ చేసేందుకు సీఐడీ సిద్దమవుతోందన్న వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ఏపీ ఫైబర్ గ్రిడ్ స్కాంలో లోకేశ్ అరెస్ట్ కోసం ప్రత్యేక బృందాలను కూడా సిద్ధం చేశారని ప్రచారం సాగుతోంది. ఫైబర్ గ్రిడ్ కేసులో ఇప్పటికే కొందరిని సీఐడీ అరెస్ట్ చేసింది. వారికి కోర్టుల్లో బెయిల్ కూడా లభించింది. ఈ క్రమంలో లోకేశ్ అరెస్ట్ అయితే.. టీడీపీ పరిస్థితి ఏంటి? పార్టీని ఎవరు నడిపిస్తారు? అనే చర్చ పార్టీ వర్గాల్లో నడుస్తోంది.