AP Assembly 2024: అసెంబ్లీ లాబీలో చింతమనేని, పల్లె రఘనాథ రెడ్డి మధ్య ఆసక్తికర సంభాషణ.. కోడలు విషయం ప్రస్తావిస్తూ..
నన్ను వేధించిన అధికారులే కావాలంటూ మా నాయకులే వారికి మంచి పోస్టింగ్ లు ఇప్పించుకున్నారని చింతమనేని ..

chintamaneni prabhakar, Palle raghunatha Reddy
MLA Chinthamaneni Prabhakar – Palleraghunatha Reddy : ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నాల్గో రోజు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాల్లో భాగంగా అసెంబ్లీ లాబీలో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, మాజీ మంత్రి పల్లెరఘునాథ రెడ్డి మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. చింతమనేని మాట్లాడుతూ.. గత ఐదేళ్లలో నాపై వైసీసీ ప్రభుత్వం 27 అక్రమ కేసులు పెట్టింది. నిన్ననే రెండు కేసులను న్యాయస్థానం తప్పని కొట్టేసింది. మరో 25అక్రమ కేసులు నాపై ఉన్నాయని అన్నారు.
Also Read: Banana Phobia: మహిళా మంత్రికి ‘బనానా ఫోబియో’.. అరటి పండు కనిపిస్తే వణికిపోతుంది
నాపై అక్రమ కేసులు పెట్టిన అధికారులంతా ఎక్కడెక్కడో ప్రశాంతంగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు. నన్ను వేధించిన అధికారులే కావాలంటూ మా నాయకులే వారికి మంచి పోస్టింగ్ లు ఇప్పించుకున్నారని చింతమనేని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని వైసీపీ దుర్వినియోగం చేసింది. నిన్న నాపై కొట్టేసిన రెండు కేసులు కూడా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం దుర్వినియోగం చేసి పెట్టినవే. కేసులో బాధితులుగా నాతో పాటు ఎస్సీలూ ఉండటం గమనార్హం అంటూ చింతమనేని వ్యాఖ్యానించారు.
Also Read: కాంగ్రెస్ సర్కార్‌కు ఎందుకు టార్గెట్ అయ్యారు? కేటీఆర్‌తో 10టీవీ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ..
మాజీమంత్రి పల్లె రఘునాథరెడ్డి మాట్లాడుతూ.. నాపైనా 14 అక్రమ కేసులు పెట్టారు. పుట్టపర్తిలో లోకేశ్ పర్యటన విజయవంతమైందని నాపై కేసులు పెట్టారని అన్నారు. ఈ క్రమంలో చింతమనేని కల్పించుకొని.. గురువు విద్యార్థిని తీర్చిదిద్దినట్లు కోడల్ని రాజకీయాల్లో తీర్చిదిద్దుతున్నారుగా అని పల్లెతో అన్నారు. ఆయన స్పందిస్తూ.. కోడలు సింధూర కేరళ మాజీ డీజీపీ కుమార్తె. అంతేకాదు.. ఎంటెక్ గోల్డ్ మెడలిస్ట్. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, ఇంగ్లీషు ఇలా మొత్తం ఎనిమిది భాషలు సింధూరకు వచ్చునని పల్లె రఘునాథరెడ్డి బదులిచ్చాడు.