ఏం తేలుస్తారు? పోలవరంలో అమెరికా, కెనడా నిపుణుల బృందం

నాలుగు రోజుల పాటు ఏపీలోనే మకాం వేసి ప్రాజెక్ట్ పై క్షుణ్ణంగా అధ్యయనం చేస్తారు. ప్రాజెక్ట్ ఇతర పనుల పురోగతిపై నిపుణుల బృందం అధికారులతో చర్చించబోతోంది.

ఏం తేలుస్తారు? పోలవరంలో అమెరికా, కెనడా నిపుణుల బృందం

Polavaram Project : పోలవరం ప్రాజెక్ట్ లో ఇంటర్నేషనల్ ఎక్స్ పర్ట్స్ టీమ్ పరిశీలిస్తోంది. ప్రాజెక్ట్ కు సంబంధించి పలు విషయాలను అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు నిపుణులు. అప్పర్ కాపర్ డ్యామ్ పై ఏర్పాటు చేసిన ఫొటో గ్యాలరీని నిపుణుల బృందం పరిశీలించింది. ఫొటో గ్యాలరీని చూపిస్తూ ప్రాజెక్ట్ కు సంబంధించిన డీటైల్స్ ను అధికారులు వివరించారు. అంతర్జాతీయ ఎక్స్ పర్ట్ టీమ్ లో ఇద్దరు అమెరికా, ఇద్దరు కెనడా నిపుణులు ఉన్నారు. అమెరికా నుంచి డేవిడ్ బి పాల్, కేన్ ఫ్రాంకో డికికో.. కెనడా నుంచి వచ్చిన రిచర్డ్ డొన్నెల్లీ, సీన్ హించ్ బెర్గర్.. పోలవరం ప్రాజెక్ట్ ను పరిశీలిస్తున్నారు. వీరు నాలుగు రోజుల పాటు ఏపీలోనే ఉండి పోలవరం ప్రాజెక్ట్ ను పరిశీలిస్తారు.

ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవనాడి పోలవరం పనులపై ఏపీ సర్కార్ దృష్టి పెట్టింది. సీఎం చంద్రబాబు పోలవరం నిర్మాణంపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. వీలైనంత తొందరగా ప్రాజెక్ట్ ను పూర్తి చేయాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగా ఇవాళ పోలవరం ప్రాజెక్ట్ కు అంతర్జాతీయ నిపుణుల బృందం వచ్చింది. ప్రస్తుతం ఎక్స్ పర్ట్స్ టీమ్ ప్రాజెక్ట్ ను పరిశీలిస్తోంది. నాలుగు రోజుల పాటు ఏపీలోనే మకాం వేసి ప్రాజెక్ట్ పై క్షుణ్ణంగా అధ్యయనం చేస్తారు. ప్రాజెక్ట్ ఇతర పనుల పురోగతిపై నిపుణుల బృందం అధికారులతో చర్చించబోతోంది. నైపుణ్య ఏజెన్సీలు, ప్రొఫెసర్లు, నిపుణులతో అంతర్జాతీయ ఎక్స్ పర్ట్స్ టీమ్ డిస్కస్ చేయనుంది.

పోలవరం ప్రాజెక్ట్ వద్ద విదేశీ నిపుణుల బృందం తొలిరోజు పర్యటన ముగిసింది. మొదటి రోజే ప్రాజెక్ట్ లోని అన్ని విభాగాలపై క్షేత్ర స్థాయి పరిశీలన జరిపిన విదేశీ నిపుణుల బృందం.. రేపు ఉదయం డయాప్రమ్ వాల్ ను, అక్కడ ఏర్పడిన అగాధాలను పరిశీలించబోతున్నారు. అంతకుముందు ప్రాజెక్ట్ కు సంబంధించి పలు విషయాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్ట్ స్థితిగతులపై ఎక్స్ పర్ట్స్ టీమ్ ఆరా తీసింది. ఇవాళ 6 గంటల పాటు ప్రాజెక్ట్ ను పరిశీలించింది నిపుణుల బృందం.

Also Read : వలంటీర్లకు స్వస్తి చెబుతున్న ప్రభుత్వం?