కౌంట్ డౌన్ : GSLV F – 10 ప్రయోగానికి ఏర్పాట్లు

నెల్లూరు జిల్లాలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్)లో మరో ప్రయోగానికి రంగం సిద్ధమైంది. రెండో ప్రయోగ వేదిక నుంచి జియో సింక్రోనస్ లాంచింగ్ శాటిలైట్ వెహికల్ (GSLV F -10) నింగిలోకి దూసుకెళ్లడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. 2020, మార్చి 05వ తేదీ గురువారం సాయంత్రం 5.43 గంటలకు నింగిలోకి దూసుకెళ్లనుంది. ఇందుకు కౌంట్ డౌన్ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇస్రో ఛైర్మన్ డాక్టర్ కే.శివన్ చేతుల మీదుగా బుధవారం ఉదయం 3.43 గంటలకు కౌంట్ డౌన్ ప్రారంభం కానుంది.
జియో ఇమేజింగ్ శాటిలైట్ పేరిట రిమోట్ సెన్సింగ్ శాటిలైట్‌ను మొట్టమొదటిసారిగా భూస్థిర కక్ష్యలోకి పంపి పనిచేసే విధంగా ఇస్త్రో శాస్త్రవేత్తలు రూపొందించారు. దీని తర్వాత జులైలో GSLV F – 12 రాకెట్ ద్వారా జీ ఐశాట్ – 2 రెండో ఉపగ్రహాన్ని పంపేందుకు ఇస్త్రో రెడీ అవుతోంది. దేశ భద్రత అవసరాలు, రక్షణ వ్యవస్థతో అనుసంధానం, విపత్తులు సంభించినప్పడు ముందస్తు సమాచారాన్ని తెలుసుకొనేందుకు ఈ రెండు భారీ రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాలను ఉపయోగిస్తున్నారు.
* 2020 మార్చి 04వ తేదీ బుధవారం ఉదయం 10 గంటలకు షార్‌లోని బ్రహ్మ ప్రకాష్ హాలులో MDR సమావేశం.
* తుది విడత పరీక్షలు చస్తారు. ల్యాబ్‌కు ప్రయోగ పనులు.
* బుధవారం సాయంత్రం నుంచి రాకెట్ రెండో దశలో ద్రవ ఇంధనం నింపే ప్రక్రియ.
* 2020, మార్చి 05వ తేదీ గురువారం ఉదయం నుంచి రాకెట్‌కు అవసరమైన హీలియం, నెట్రోజన్ గ్యాస్‌లు నింపడం, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ వ్యవస్థలను అప్రమత్తం చేసే ప్రక్రియకు ఏర్పాట్లు.
* గురువారం సాయంత్రం 5.43గంటలకు 2 వేల 268 కిలోల బరువు కలిగిన జీఐశాట్ -1 ఉపగ్రహాన్ని మోసుకుని జీఎస్ఎల్‌వీ ఎప్ – 10 రాకెట్‌కు నింగికి దూసుకు వెళ్తుంది.
See Also | FASTag లేకుండా..ORRపైకి వెళ్లారో..బాదుడే