Heavy Rain : పుట్టపర్తిలో భారీగా కురుస్తున్న వర్షం.. రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా..

ఎగువ ప్రాంతాలలో కురుస్తున్న వర్షాలకి చిత్రావతి నదిలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. వరద నీటికి చిత్రావతి పొంగి పరవళ్ళు తొక్కుతోంది.

Heavy Rain : పుట్టపర్తిలో భారీగా కురుస్తున్న వర్షం.. రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా..

Puttaparthi Heavy Rain

Updated On : September 24, 2023 / 8:34 AM IST

Puttaparthi Heavy Rain : ఆంధ్రప్రదేశ్ లోని శ్రీ సత్య సాయి జిల్లా పుట్టపర్తిలో రాత్రి నుంచి భారీగా వర్షం కురుస్తోంది. ఎడతెరపి లేకుండా దంచి కొడుతున్న వర్షానికి రహదారులు వాగులు వంకలను తలపించాయి. ఎగువ ప్రాంతాలలో కురుస్తున్న వర్షాలకి చిత్రావతి నదిలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది.

వరద నీటికి చిత్రావతి పొంగి పరవళ్ళు తొక్కుతోంది. రాయవారిపల్లి వంతెన కొట్టుకుపోయింది. కోవెలగుట్టపల్లి వంతెనపై నుంచి నీరు ప్రవహిస్తోంది. రాయలవారిపల్లి, కోవెలగుట్టపల్లి గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

IMD Issues Yellow Alert : పలు రాష్ట్రాల్లో భారీవర్షాలు…ఐఎండీ ఎల్లో అలర్ట్ జారీ

దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చిత్రావతి నదిపై నిర్మించిన బ్రిడ్జి నుండి వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తూ బుక్కపట్నం చెరువుకు చేరుతోంది.