Jagan On Elections: ఆ తర్వాతే ఎన్నికలకు వెళ్తాము.. 95 శాతం మేనిఫెస్టో హామీలను ఇప్పటికే నెరవేర్చాం: జగన్
ప్రకాశం జిల్లా చీమకుర్తిలో ఏపీ సీఎం జగన్ ఇవాళ పర్యటించారు. ఆ ప్రాంతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి సుబ్బారెడ్డి విగ్రహాలను జగన్ ఆవిష్కరించారు. ఆ తర్వాత నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ... వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించాకే ఎన్నికలకు వెళ్తామని అన్నారు. వచ్చే ఏడాది సెప్టెంబరులో వెలిగొండ ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తామని, ఆ ప్రాజెక్టు రెండు టన్నెళ్ల పనులు జరుగుతున్నాయదని అన్నారు.

Jagan On Elections
Jagan On Elections: ప్రకాశం జిల్లా చీమకుర్తిలో ఏపీ సీఎం జగన్ ఇవాళ పర్యటించారు. ఆ ప్రాంతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి సుబ్బారెడ్డి విగ్రహాలను జగన్ ఆవిష్కరించారు. ఆ తర్వాత నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ… వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించాకే ఎన్నికలకు వెళ్తామని అన్నారు. వచ్చే ఏడాది సెప్టెంబరులో వెలిగొండ ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తామని, ఆ ప్రాజెక్టు రెండు టన్నెళ్ల పనులు జరుగుతున్నాయదని అన్నారు.
తాము గ్రానైట్ పరిశ్రమలో మళ్ళీ స్లాబ్ సిస్టమ్ తీసుకొస్తున్నట్లు జగన్ తెలిపారు. పేదల సంక్షేమం అంటే మొదట వైఎస్సార్ పేరు గుర్తుకు వస్తుందని ఆయన చెప్పారు. ఆయన బిడ్డగా తాను నాలుగు అడుగులు ముందుకు వేస్తానని అన్నారు. తాము 95 శాతం మేనిఫెస్టో హామీలను ఇప్పటికే నెరవేర్చామని తెలిపారు.
తాము ఇచ్చిన హామీ మేరకు చిన్న పరిశ్రమలకు మేలు జరిగేలా నిర్ణయాలు అమలు చేయబోతున్నామని జగన్ చెప్పారు. చిన్న గ్రానైట్ పరిశ్రమలకు విద్యుత్తు ఛార్జీల్లో రూ.2 తగ్గింపు ఉంటుందని తెలిపారు. అలాగే, ఒంగోలులో శిథిలావస్థలో ఉన్న కొత్త జిల్లా పరిషత్ ఆఫీసుకు రూ.20 కోట్లు మంజూరు చేస్తామని చెప్పారు.
Retail Price Of Rice Rises: ఇప్పటికే గోధుమ ధరల పెరుగుదల.. ఇప్పుడు బియ్యం ధరలూ ఆ బాటలోనే..