గ్రహణ సమయంలో రోడ్డుపై కూర్చుని తిన్నారు, తాగారు
డిసెంబరు 26, 2019 గురువారం మూల నక్షత్రం ధనస్సు రాశిలో కేతు గ్రస్త కంకణాకార సూర్యగ్రహణం ఏర్పడింది. ఈ సూర్యగ్రహణ స్పర్శకాలం ఉదయం 8.03 గంటలు కాగా,

డిసెంబరు 26, 2019 గురువారం మూల నక్షత్రం ధనస్సు రాశిలో కేతు గ్రస్త కంకణాకార సూర్యగ్రహణం ఏర్పడింది. ఈ సూర్యగ్రహణ స్పర్శకాలం ఉదయం 8.03 గంటలు కాగా,
డిసెంబరు 26, 2019 గురువారం మూల నక్షత్రం ధనస్సు రాశిలో కేతు గ్రస్త కంకణాకార సూర్యగ్రహణం ఏర్పడింది. ఈ సూర్యగ్రహణ స్పర్శకాలం ఉదయం 8.03 గంటలు కాగా, మోక్షకాలం ఉ.11.11 గంటలు. మూడు గంటల పాటు ఉండే ఈ సంపూర్ణ సూర్యగ్రహణం భారత్‌తోపాటు ఆసియాలోని పలుదేశాల్లో కనువిందు చేస్తోంది. సూర్యగ్రహణం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో అన్ని ఆలయాలను బుధవారం(డిసెంబర్ 25,2019) రాత్రి నుంచి మూసివేశారు. గురువారం మధ్యాహ్నం 12 గంటలకు అభిషేకం, సంప్రోక్షణ తర్వాత తిరిగి తెరుస్తారు.
కాగా, గ్రహణ కాలం సమయంలో ఎలాంటి ఆహారం తీసుకోకూడదని చెబుతారు. మంచి నీళ్లు కూడా తాగొద్దని శాస్త్రాలు చెబుతాయి. వాటిని విశ్వసించే వాళ్లు ఉంటారు. విశ్వసించని వాళ్లు కూడా ఉంటారు. గ్రహణానికి ముందు నుంచే ఇంట్లో వంట చేయకూడదని అనేక నియమాలు చెబుతూ ఉంటారు. సూర్యరశ్మి కనిపించని సమయంలో బ్యాక్టీరియా చురుగ్గా పని చేస్తుందని ఆయుర్వేద నిపుణులు కూడా చెబుతుంటారు. అందుకే గ్రహణ సమయంలో ఆహారం తీసుకోవద్దని సూచనలు చేస్తుంటారు.
అయితే ఇవన్నీ మూఢ నమ్మకాలే అని జన విజ్ఞాన వేదిక వాళ్లు అంటున్నారు. గ్రహణ కాలం సమయంలో ఆహారం తినకూడదు, నీళ్లు తాగకూడదు అనేది కరెక్ట్ కాదన్నారు. గ్రహణ కాలం సమయంలో తినడం వల్ల కానీ నీరు తాగడం వల్ల కానీ ఎలాంటి హాని జరగదన్నారు. సైన్స్ ఆధారంగా తాము ఇలా చెబుతున్నామని తెలిపారు. అంతేకాదు.. గ్రహణ కాలం సమయంలో జన విజ్ఞాన వేదిక సభ్యులు విశాఖలో నడిరోడ్డుపై కూర్చుని ఆహారం తిన్నారు. నీళ్లు తాగారు. చూడండి.. మాకేమీ కాలేదు అని చెప్పారు. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు, మూఢ నమ్మకాలు తొలగించేందుకు వారిలో చైతన్యం నింపేందుకు తాము ఇలా చేశామని వారు వివరించారు.
ఆర్కే బీచ్ లో గ్రహణాన్ని వీక్షించేందుకు జనవిజ్ఞాన వేదిక ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. నగరంలో మొత్తం 45 కేంద్రాలను ఏర్పాటు చేసి… గ్రహణాన్ని ప్రత్యక్షంగా చూసే అవకాశం కల్పించింది. అంతేకాదు.. గ్రహణంపై ప్రజల్లో ఉన్న అపోహలు తొలగించేందుకు, వారిలో చైతన్యం కలిగించేందుకు ఆర్కేబీచ్‌లో టిఫిన్లను సైతం ఏర్పాటు చేశారు.