Pawan Kalyan warn To YCP : ఆంధ్రప్రదేశ్‌ను విడగొడతాం అంటే తోలు తీస్తాం : పవన్ కల్యాణ్
జనసేన అధినేత పవన్ కల్యాన్ మరోసారి వైసీపీ నేతలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రజల్లో చిచ్చులు పెట్టిన ఆంధ్రప్రదేశ్ ను విడగొడతం అంటే తోలు తీస్తాం అంటూ పవన్ కల్యాణ్ తీవ్ర వైసీపీ నేతలకు వార్నింగ్ ఇచ్చారు.

janasena pawan kalyan warning to YCP Leaders
Pawan Kalyan warn To YCP : జనసేన అధినేత పవన్ కల్యాన్ మరోసారి వైసీపీ నేతలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మంగళగిరిలో జనవ్ మాట్లాడుతూ..వైసీపీ నేతలకు పవన్ తనదైన శైలిలో వార్నింగ్ ఇచ్చారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రం విడిపోయిన రెండుగా మారాయిపోయాయి. ఇప్పుడు ప్రజల్లో చిచ్చులు పెట్టిన ఆంధ్రప్రదేశ్ ను విడగొడతం అంటే తోలు తీస్తాం అంటూ పవన్ కల్యాణ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే మూడు రాజధానులు అంటూ ఆంధ్రప్రదేశ్ లో గందరగోళం సృష్టించిన వైసీపీ ప్రభుత్వం ఇప్పటికైనా వేర్పాటువాద రాజకీయాలు మానుకోవాని సూచించారు. లేదు..కాదూ కూడదు ఇలాగే వ్యవహరిస్తాం అంటూ వేర్పాటువాద రాజకీయాలు చేస్తే సహించేదిలేదని ప్రజల మధ్య చిచ్చు పెడుతూ విభజన రాజకీయాలు చేస్తే తోలుతీస్తామని అటువంటి వ్యాఖ్యలు చేస్తే నాలో తీవ్రవాదిని చూస్తారంటూ ఘాటు వార్నింగ్ ఇచ్చారు.
ఇప్పటికే ప్రజల సొమ్ముకోట్లాది రూపాయలు దోచేశారు అంటూ వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన పవన్ ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు కూడా దోచుకున్నారని అరోపించారు. విజభన రాజకీయాలు చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని అధికారంలో ఉన్నారు కదాని ఇష్టానురీతిగా వ్యవహరించినా..విభజన రాజకీయాలు చేసినా తోలుతీస్తామని వార్నింగ్ ఇచ్చారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో 74 గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా జాతీయ జెండాను ఎగురవేసిన పవన్ ఏపీ ప్రజల కోసం నేనున్నానని నా కుటుంబ కంటే ప్రజలే నాకు ఎక్కువని అటువంటి ప్రజల మధ్య చిచ్చులు పెట్టి విభజన రాజకీయాలు చేస్తే తీవ్ర పరిణామాలుంటాయంటూ వార్నింగ్ ఇచ్చారు.రాజకీయాలు చేస్తే తీవ్ర పరిణామాలుంటాయని..వైసీపీ నేతలు ఒళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాడాలంటూ వార్నింగ్ ఇచ్చారు.
అవినీతిలో కూరుకుపోయిన మీకు రాజ్యాంగం గురించి ఏం తెలుస్తుంది? అని తీవ్రంగా ప్రశ్నించారు. మరోసారి ఏపీని విడగొడతాం అంటే తోలు తీసి కింద కూర్చోపెడతాం అని రాష్ట్రాన్ని విడగొడతాం అని మరోసారి అంటే నాకంటే తీవ్రవాదిని మీరు చూడరంటూ వార్నింగ్ ఇచ్చారు. అధికారం చేతుల్లో ఉంది కదాని మీ ఇష్టమొచ్చినట్లుగా చేస్తూ చూస్తూ కూర్చోమని..సన్యాసి నేతలు చేసే పిచ్చి రాజకీయాలు చూసి చూసి విసిగిపోయిన ప్రజలు మిమ్మల్ని తరమికొడతారన్నారు. రాయలసీమ ప్రజలు బతకలేక వలసలు వెళ్లిపోతుంటే ఆ ప్రాంతంనుంచే నేతలుగా సీఎంలుగా అయినవారు ఏం చేస్తున్నారు? అని ప్రశ్నించారు.ఇక చాలు..రాష్ట్రాలను విడగొట్టి ప్రజలను విడగొట్టి చిచ్చులు పెట్టింది ఇక చాలని ఇకపై విభజన రాజకీయాలు చేస్తే ఒక్కొక్కరి తోలు తీస్తాం అని ఏం తమాషాగా ఉందా? అంటూ ప్రశ్నించారు. ఏపీలో ఎంతమంది గొప్ప వ్యక్తులు ఉన్నారో మీకు తెలుసా? వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం గుంటూరువాసులు ప్రాణాలు అర్పించారనే విషయం మీకు తెలుసా? మాట్లాడితే రాష్ట్రాన్ని విడగొతం పడగొడతాం అంటూ పిచ్చి మాటలు మాట్లాడటం తప్ప అంటూ వైసీపీ నేతలపై తీవ్రంగా విరుచుకుపడ్డారు పవన్. అధికారంలో ఉండి కూడా స్టీల్ ప్లాంట్ కోసం పట్టించుకోని మీకు ఉత్తరాంధ్ర ప్రత్యేక రాష్ట్రంగా కావాలా? అంటూ ప్రశ్నించారు. కొన్ని రోజుల క్రితం మంత్రి ధర్మాన విశాఖలో రాజధాని ఏర్పాటు చేయాలి? లేదంటే ఉత్తరాంధ్రాను ప్రత్యేక రాష్ట్రంగా ఇవ్వాలంటూ చేసిన డిమాండ్ పై పవన్ ఈ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ప్రధాని మోడీని కలిసిపనప్పుడల్లా వెంకటేశ్వర స్వామి విగ్రహాలు బహుమతులుగా ఇస్తున్నవారు కానీ రాష్ట్రంలో మాత్రం దేవుళ్ల విగ్రహాలు ధ్వంసం చేస్తుంటే మాత్రం ఏమీ చేయటంలేదంటూ సీఎం జగన్ పై సెటైర్లు పవన్. రాబోయే కాలం యువతరానిదే..అటువంటి యువత రాజకీయాల్లోకి వచ్చి దేశ భవిష్యత్తు కోసం పాటుపడాలని కుళ్లు రాజకీయాలను కడిగివేసి సమాజంలో సుపరిపాలన రావాటానికి యువత కృషి చేయాలని ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. యువత తమవంతు బాధ్యతగా రాజకీయాల్లో పాలుపంచుకోవాలని సూచించారు.