Pawan Kalyan : పవన్ కల్యాణ్‌ తెనాలి పర్యటన రద్దు.. కారణం ఏంటంటే

తెనాలి పర్యటనకు త్వరలోనే తేదీ, సమయం ప్రకటిస్తామని జనసేన నేతలు చెప్పారు.

Pawan Kalyan : పవన్ కల్యాణ్‌ తెనాలి పర్యటన రద్దు.. కారణం ఏంటంటే

Pawan Kalyan

Pawan Kalyan : జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెనాలి పర్యటన రద్దైంది. జ్వరంతో బాధ పడుతుండటంతో తెనాలి రాలేనని జనసేన వర్గాలకు సమాచారం ఇచ్చారు పవన్. దీంతో తెనాలిలో రోడ్ షో, బహిరంగ సభ రద్దైనట్లు జనసేన ప్రకటించింది. నిన్న 20 కిలోమీటర్లు ఎండలో పాదయాత్ర చేశారు పవన్ కల్యాణ్. ఎండ తీవ్రతతో అస్వస్థతకు గురయ్యారు. తెనాలి పర్యటనకు త్వరలోనే తేదీ, సమయం ప్రకటిస్తామని జనసేన నేతలు చెప్పారు. జనసేనలో నెంబర్ 2గా ఉన్న నాదెండ్ల మనోహర్ తెనాలి నుంచి పోటీ చేస్తున్నారు.

షెడ్యూల్ ప్రకారం జనసేనాని పవన్ కల్యాణ్ ఈ మధ్యాహ్నం తెనాలిలో పర్యటించాల్సి ఉంది. జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్ కోసం ఆయన ఈ రోజంతా రోడ్ షో చేయాల్సి ఉంది. సాయంత్రం 6 గంటలకు తెనాలిలో భారీ బహిరంగ సభలో పాల్గొనాల్సి ఉంది. అయితే జ్వరం కారణంగా పవన్ కల్యాణ్ తెనాలి పర్యటన రద్దైంది.

గత 4 రోజుల నుంచి పవన్ కల్యాణ్ పిఠాపురంలో పర్యటిస్తున్నారు. పవన్ చాలా కాలంగా జ్వరంతో బాధ పడుతున్నారని, దగ్గు వస్తోందని జనసేన వర్గాలు చెబుతున్నాయి. అయినా కూడా పవన్ కల్యాణ్ అలానే పర్యటిస్తున్నారు. నిన్న కూడా పిఠాపురంలో ఎండలో పాదయాత్ర చేశారు. గత రెండు మూడు రోజులుగా ఆయన పిఠాపురంలో స్థానికులతో విస్తృతంగా సమావేశం అవుతున్నారు. ఎన్నికల ప్రచారం ముమ్మరం చేశారు. విశ్రాంతి లేకుండా పర్యటనలు చేస్తుండటంతో జ్వరంతో బాధపడుతున్నారని, దగ్గు కూడా వస్తోందని చెబుతున్నారు. గత నెల రోజుల వ్యవధిలో పవన్ పలుసార్లు అనారోగ్యానికి గురయ్యారు.

ఈ నేపథ్యంలో ఆయన తెనాలి పర్యటనను రద్దు చేసుకున్నారు. తెనాలి పర్యటనతో పాటు ఉత్తరాంధ్రలో పవన్ పర్యటించాల్సి ఉంది. 7, 8వ తేదీ వరకు పర్యటించాల్సి ఉంది. జ్వరం తీవ్ర కావడంతో పవన్ పర్యటనను రీషెడ్యూల్ చేయడానికి జనసేన సమాయత్తం అవుతోంది. రెండు మూడు రోజుల పాటు కచ్చితంగా పవన్ కల్యాణ్ కు విశ్రాంతి అవసరం అని చెబుతున్నారు. మొత్తంగా అనారోగ్యం కారణంగా రెండు మూడు రోజుల పాటు పవన్ పర్యటనను ఆపేయాల్సి వచ్చింది.

Also Read : నెల్లూరులో వైసీపీ పెద్ద సాహసం.. విజయం ఖాయమేనా?