Pawan Kalyan: వైసీపీతో నేను యుద్ధానికి సిద్ధం.. దేంతోనైనా రండి తేల్చుకుందాం
వైసీపీలో బూతులుతిట్టని వాళ్లంటే నాకు గౌరవం. బూతులు తిట్టే వైసీపీ నాయకులకు ఇదే చెబుతున్నా, నిల్చోబెట్టి తోలువలుస్తా అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో హెచ్చరికలు చేశారు.

Pawan Kalyan
Pawan Kalyan: ఇంతకాలం పవన్ తాలూకు మంచితనం చూశారు.. పోన్లే అని ఇన్నాళ్లూ ఊరుకున్నా.. బూతులు తిట్టే ప్రతీ నా కొడుక్కు ఇదే నా హెచ్చరిక.. నిల్చోబెట్టి తోలుతీస్తా అంటూ వైసీపీ నేతలనుద్దేశించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళగిరిలో జనసైనికులతో పవన్ కళ్యాణ్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వంపై, ఆ పార్టీలోని కొందరు నేతలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇంతకాలం చాలా ఓపిగ్గా ఉన్నానని, నేను అందరూ బాగుండాలని కోరుకునే వాడినని, కానీ నా మంచితనాన్ని చేతకాని తనంగా కొందరు తీసుకుంటున్నారంటూ పవన్ అన్నారు. నేను మంచికోసం ఎంతకైనా తెగిస్తానని, నాకు ఈ ధైర్యం తెలంగాణ నుంచి వచ్చిందన్నారు.
Janasena : నన్ను ప్యాకేజ్ స్టార్ అన్న సన్నాసిని చెప్పు తీసుకుని కొడతా : పవన్ కళ్యాణ్
వైసీపీలో బూతులుతిట్టని వాళ్లంటే నాకు గౌరవమని చెప్పిన పవన్, బూతులు తిట్టే వైసీపీ నాయకులకు ఇదే చెబుతున్నా, నిల్చోబెట్టి తోలువలుస్తా అంటూ తీవ్ర స్థాయిలో హెచ్చరికలు చేశారు. నాకు రాజకీయం తెలియదనుకుంటున్నారా? నేను బాపట్లలో పెరిగా.. ఉప్పుకారం తినిపెరిగా, చొక్కా పట్టుకొని ఇళ్లల్లోంచి తీసుకొచ్చి కొడతాం అంటూ తీవ్రస్థాయిలో పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతలు చేసేది క్రిమినల్ పాలిటిక్స్, అవకాశ రాజకీయమన్న పవన్.. మేం సిద్ధాంతంతో రాజకీయం చేస్తామని అన్నారు.
10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..
మీరు యుద్ధం అని చెప్పండి.. రాడ్లా, హాకీ స్టిక్కులా, రాళ్లా లేకుంటే వట్టి చేతులా.. నేను దేనికైనా రెడీ. ఎంతమంది వైసీపీ గూండాలు, ఎమ్మెల్యేలు వస్తారో ఛాలెంజ్ చేసి చెబుతున్నా. వైసీపీతో నేను యుద్ధానికి సిద్ధం, దేంతోనైనా రండి తేల్చుకుందాం అంటూ పవన్ అన్నారు. ఎవరైనా పద్దతిదాటి నోరుజారితే చూస్తూ ఊరుకోనని, ఇకనుంచి మా సత్తాకూడా ఏమిటో వైసీపీ నేతలు రుచిచూస్తారంటూ పవన్ అన్నారు. నేను అన్ని కులాలను గౌరవిస్తానన్న పవన్.. ఇకపై నా రాజకీయం ఏంటో చూపిస్తా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.