Pawan Kalyan Viral Fever : పవన్ కళ్యాణ్ కు వైరల్ ఫీవర్..జనవాణి కార్యక్రమం వాయిదా

ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పర్యటన అనంతరం పవన్‌ కళ్యాణ్‌తో పాటు ప్రోగ్రాం కమిటీ నాయకులు, సెక్యూరిటీ సిబ్బంది కూడా వైరల్‌ ఫీవర్‌ బారిన పడ్డారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్‌ నాయకులు నాదేండ్ల మనోహర్‌ తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ నెల 24వ తేదీన జరగాల్సిన జనవాణి కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు నాదేండ్ల మనోహర్‌ వెల్లడించారు.

Pawan Kalyan Viral Fever : పవన్ కళ్యాణ్ కు వైరల్ ఫీవర్..జనవాణి కార్యక్రమం వాయిదా

Pawan

Updated On : July 20, 2022 / 5:35 PM IST

Pawan Kalyan Viral Fever : జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ అనారోగ్యానికి గురయ్యారు. పవన్ వైరల్‌ ఫీవర్‌ బారిన పడ్డారు. దీంతో జనవాణి కార్యక్రమం వాయిదా పడింది. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పర్యటన అనంతరం పవన్‌ కళ్యాణ్‌తో పాటు ప్రోగ్రాం కమిటీ నాయకులు, సెక్యూరిటీ సిబ్బంది కూడా వైరల్‌ ఫీవర్‌ బారిన పడ్డారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్‌ నాయకులు నాదేండ్ల మనోహర్‌ తెలిపారు.

Pawan Kalyan : ప్రశ్నిస్తే బెదిరించడం, భయపెట్టడం వైసీపీ నైజం-పవన్ కళ్యాణ్

ఈ నేపథ్యంలో ఈ నెల 24వ తేదీన జరగాల్సిన జనవాణి కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు నాదేండ్ల మనోహర్‌ వెల్లడించారు. ఈ నెల 31 న రాయలసీమ లేదా ఉత్తారాంధ్రలో తదుపరి జనవాణి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఇప్పటివరకు 5 విడతలకు గానూ 3 విడతల జనవాణిని పూర్తి చేశామని తెలిపారు.