Bus Accident : బస్సులో టెక్నికల్ సమస్యలు లేవు..మానవ తప్పిదం వల్లే ప్రమాదం

పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో ప్రమాదానికి గురైన బస్సులో ఎలాంటి సమస్యలు లేవని డిప్యూటీ చీఫ్ మెకానికల్ ఇంజినీర్ శ్రీనివాస్ అన్నారు. మానవ తప్పిదం వల్లే ప్రమాదం జరిగిందన్నారు.

Bus Accident : బస్సులో టెక్నికల్ సమస్యలు లేవు..మానవ తప్పిదం వల్లే ప్రమాదం

Bus Accident

Updated On : December 15, 2021 / 3:57 PM IST

Jangareddy Goodem bus accident : పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డి గూడెంలో ప్రమాదానికి గురైన బస్సు కొత్తదని..ఎలాంటి సమస్యలు లేవని డిప్యూటీ చీఫ్ మెకానికల్ ఇంజినీర్ శ్రీనివాస్ అన్నారు. గత వారం రోజులుగా ఎలాంటి సమస్యలు లేవని..రాలేదని చెప్పారు. బస్సులో టెక్నికల్ సమస్యలు తలెత్తలేదని తెలిపారు. ఏపీ 37జెడ్ 193 నెంబర్ గల బస్సు లేటెస్టు వెహికిల్ అని వెల్లడించారు.

ఈ బస్సు 3లక్షల 11 కి.మీ మాత్రమే తిరిగిందని తెలిపారు. ఇది కొత్త బస్సు కిందే లెక్క అన్నారు. మానవ తప్పిదం వల్లే ప్రమాదం జరిగిందని స్పష్టం చేశారు. డ్రైవర్ చిన్నారావు రోడ్డును సరిగా ఎస్టిమేట్ చేయలేకపోయాడని పేర్కొన్నారు. ప్రమాద సమయంలో బస్సులో 43 మంది ప్రయాణికులు ఉన్నారని వెల్లడించారు.

APSRTC Bus Accident : బస్సు ప్రమాద ఘటనపై విచారణకు ఆదేశించిన పేర్నినాని

పశ్చిమగోదావరరి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. బస్సు వాగులో పడిన ఘటనలో మృతుల సంఖ్య 10కి చేరింది. ప్రమాదంలో డ్రైవర్ సహా 10 మంది మృతి చెందారు. మృతుల్లో ఐదుగురు మహిళలు ఉన్నారు. పలువురికి గాయాలు అయ్యాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. అశ్వరావుపేట నుంచి జంగారెడ్డి గూడెం వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది.

బస్సు వంతెన రెయిలింగ్ ను ఢీకొని జల్లేరువాగులో బోల్తా పడింది. 50 అడుగుల ఎత్తు నుంచి బస్సు వాగులో పడింది. ప్రమాదానికి గురైన బస్సు..జంగారెడ్డిగూడెం డిపోకు చెందినదిగా గుర్తించారు. క్రేన్ సహాయంతో అధికారులు బస్సును బయటికి తీశారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

APSRTC Bus Accident : బస్సు ప్రమాద సంఘటన పట్ల ఏపీ గవర్నర్ విచారం

బస్సులో పరిమితికి మించి ప్రయాణికులు ఉన్నారు. కాగా బస్సు వేలేరుపాడులో నైట్ హాల్ట్ ఉన్నది. ఉదయం భద్రాచలం వెళ్లి అశ్వారావుపేట మీదుగా జంగారెడ్డిగూడెంకు ప్రయాణిస్తోంది. జంగారెడ్డిగూడెంకు 10 కి.మీ దూరంలో బస్సు ప్రమాదానికి గురైంది.