APSRTC Bus Accident : బస్సు ప్రమాద ఘటనపై విచారణకు ఆదేశించిన పేర్నినాని
పశ్చిమగోదావరిజిల్లా జంగారెడ్డిగూడెం వద్ద ఆర్టీసీ బస్సు ప్రమాదం జరిగిన ఘటనపై రవాణా శాఖ మంత్రి పేర్ని నాని విచారణకు ఆదేశించారు.

AP Transport Minister Perni Nani
APSRTC Bus Accident : పశ్చిమగోదావరిజిల్లా జంగారెడ్డిగూడెం వద్ద ఆర్టీసీ బస్సు ప్రమాదం జరిగిన ఘటనపై రవాణా శాఖ మంత్రి పేర్ని నాని విచారణకు ఆదేశించారు. ప్రమాదంపై తీవ్ర దిగ్ర్బాంతి వ్యక్తం చేసిన మంత్రి….మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేసారు. ప్రమాదం జరిగిన ఘటపై సమగ్ర విచారణ జరిపి నివేదిక అందించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు.
Also Read : APSRTC Bus Accident : బస్సు ప్రమాద సంఘటన పట్ల ఏపీ గవర్నర్ విచారం
క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని సీఎం ఆదేశించారని, వైద్య సహాయ ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుందని మంత్రి తెలిపారు. ఘటనా స్ధలంలో సహాయక చర్యలు చేపట్టాలని వైద్య ఆరోగ్యశాఖ, రెవెన్యూ, రవాణా శాఖ అధికారులను మంత్రి ఆదేశించారు.