Railway: రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. 2,3తేదీల్లో ఆ ట్రైన్ రద్దు..

రైల్వే ప్రయాణికులకు గమనిక. లింగంపల్లి - విశాఖపట్నం మధ్య నడిచే జన్మభూమి ఎక్స్ ప్రెస్

Railway: రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. 2,3తేదీల్లో ఆ ట్రైన్ రద్దు..

Janmabhoomi Express

Updated On : February 28, 2025 / 2:26 PM IST

Dakshin Madhya Railway: రైల్వే ప్రయాణికులకు గమనిక. లింగంపల్లి – విశాఖపట్నం మధ్య నడిచే జన్మభూమి ఎక్స్ ప్రెస్ ను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. విజయవాడ డివిజన్లో జరుగుతున్న పనుల కారణంగా పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం కలగనుందని పేర్కొంది. ఈ క్రమంలో విశాఖ నుంచి లింగంపల్లి వచ్చే జన్మభూమి ఎక్స్ ప్రెస్ (12805) మార్చి 2న, లింగంపల్లి నుంచి విశాఖపట్నం వెళ్లే ఇదే రైలు (12806) మార్చి 3న రద్దు చేయడం జరిగిందని రైల్వే అధికారులు తెలిపారు.