JC Prabhakar Reddy : రేవంత్ రెడ్డి సీఎం అయితే.. ఏపీకి మంచి జరుగుతుంది : జేసీ ప్రభాకర్ రెడ్డి

తెలంగాణలో రేవంత్ రెడ్డి సీఎం అయితే.. ఏపీకి మంచి జరుగుతుంది..చంద్రబాబు సీఎం అవుతారు అంటూ జేసీ ప్ర్రభాకర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

JC Prabhakar Reddy : రేవంత్ రెడ్డి సీఎం అయితే.. ఏపీకి మంచి జరుగుతుంది : జేసీ ప్రభాకర్ రెడ్డి

jc brothers

JC Prabhakar Reddy తెలంగాణా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఏపీలో కాకపుట్టిస్తున్నాయి. తెలంగాణ ఎన్నికల ప్రభావం ఏపీ ఎన్నికలపైనా.. ఫలితాలపైనా ఉంటుందని అభిప్రాయాలు వస్తున్నాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై మాజీ ఎంపీ, టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న ఎవరిపైనైనా ప్రజల నుంచి కొంత వ్యతిరేకత ఉంటుందని.. ప్రత్యర్ధులు దాన్ని తమకు అనుకూలంగా మలుచుకుంటే విజయం సాధిస్తారని అన్నారు. లేదంటే పరాజయం పాలవుతారంటూ తెలంగాణ ఎన్నికల ఫలితాలను దృష్టిలో పెట్టుకుని వ్యాఖ్యలు చేశారు. తన సోదరుడు ప్రభాకర్ రెడ్డితో కలిసి ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో కూడా అధికారపార్టీపై వ్యతిరేకత ఉంటుందన్నారు.

తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి తనదైన శైలిలో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ లో మంచి పరిపాలన అందించే వ్యక్తికే తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. పార్టీల పరంగా కాకుండా వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడు మంచి పరిపాలన అందించే వ్యక్తి అని, అందుకే ఆయనకు మద్దతు ఇచ్చామని తెలిపారు. రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు శిష్యుడే అని అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఎంపిక అయితే ఆంధ్రప్రదేశ్ కు మంచి జరుగుతుందని అన్నారు. ఐదు నెలల్లో జరిగే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ కు చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు.

Also Read: కేసీఆర్‌కు చంద్రబాబు రిటర్స్ గిఫ్ట్ ఇచ్చారంటూ తెగ ఆనందపడుతున్నారు.. అదెలాగో చెబుతారా..?: విజయసాయి రెడ్డి

కాగా.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల కౌంటింగ్ పూర్తి కావటం.. కాంగ్రెస్ విజయం సాధించటం.. సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారానికి ముహూర్తం కూడా ఫిక్స్ కావటం కూడా జరిగింది. మరికొద్ది గంటల్లో ఈ కార్యక్రమం పూర్తికానుంది. ఈ క్రమంలో తెలంగాణ రాజకీయాలు ఏపీలో కొత్త చర్చకు దారి తీశాయి. తెలంగాణలో కాంగ్రెస్ విజయం.. ఆంధప్రదేశ్ రాజకీయాలపై ప్రభావం చూపుతుందనే చర్చలు జరుగుతున్నాయి.