4 పంటలు పండే పొలాల్లో రాజధాని నిర్మాణం అసాధ్యమని చంద్రబాబుకి ముందే తెలుసు
ఏపీలో రాజధాని అంశంపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కంటిన్యూ అవుతోంది. చంద్రబాబు ఒకటంటే.. వైసీపీ నేతలు రెండంటున్నారు. రాజధానిపై చంద్రబాబు చేసిన

ఏపీలో రాజధాని అంశంపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కంటిన్యూ అవుతోంది. చంద్రబాబు ఒకటంటే.. వైసీపీ నేతలు రెండంటున్నారు. రాజధానిపై చంద్రబాబు చేసిన
ఏపీలో రాజధాని అంశంపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కంటిన్యూ అవుతోంది. చంద్రబాబు ఒకటంటే.. వైసీపీ నేతలు రెండంటున్నారు. రాజధాని మార్పుపై చంద్రబాబు చేసిన విమర్శలకు మంత్రి బొత్స సత్యనారాయణ కౌంటర్ ఇచ్చారు. తిరుపతిలో మీడియాతో మాట్లాడిన బొత్స.. చంద్రబాబుపై ధ్వజమెత్తారు. శివరామకృష్ణ కమిటీ రిపోర్టుని చంద్రబాబు తుంగలో తొక్కారని చెప్పారు. విజయవాడ-గుంటూరు మధ్య రాజధాని సాధ్యం కాని శివరామకృష్ణ కమిటీ తన నివేదికలో చెప్పిందన్నారు. 4 పంటలు పండే పొలాల్లో రాజధాని సరికాదని, భవనాలు నిర్మించొద్దని శివరామకృష్ణ కమిటీనే చెప్పింద్నారు. అయినా చంద్రబాబు పట్టించుకోలేదన్నారు.
పరిపాలన వికేంద్రీకరణ ఉండాలని శివరామకృష్ణ కమిటీ చెప్పిందని బొత్స అన్నారు. ఈ విషయాన్ని కూడా చంద్రబాబు గాలికి వదిలేశారని మండిపడ్డారు. రాజధాని గురించి శివరామకృష్ణ కమిటీ ఏం చెప్పిందో అందరికీ తెలుసన్నారు. కావాలంటే చంద్రబాబు మరోసారి ఆ కమిటీ నివేదికను చదువుకోవాలని బొత్స సూచించారు. ఇప్పటికే రూ.10వేల కోట్లు రాజధాని కోసం ఖర్చు చేశామని.. మరో రూ.3వేల కోట్లు ఖర్చు పెడితే.. అమరావతి నిర్మాణం పూర్తవుతుందని చంద్రబాబు అంటున్నారు.. ఇలా ఖర్చు చేస్తూ పోతే.. ఖాళీ భవనాల నిర్మాణానికే రూ.11వేల 752 కోట్లు ఖర్చు అవుతాయని బొత్స అన్నారు.
చంద్రబాబు ఉద్యోగులను ఉసిగొల్పుతున్నారని, రైతుల దగ్గర మొసలి కన్నీరు కారుస్తున్నారని బొత్స ఫైర్ అయ్యారు. చంద్రబాబు తప్పుడు లెక్కలు చెబుతున్నారని, పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధానిలో తొలిదశలో రూ.52వేల కోట్లకు చంద్రబాబు టెండర్లు పిలిచారని.. రూ.842 కోట్ల ప్రజాధనాన్ని కేవలం కన్సల్టెంట్ల కోసం వృథా చేశారని ఆరోపించారు. ఇప్పటికే రూ.331 కోట్లు కన్సల్టెంట్లకు చెల్లించారని చెప్పారు. ఇప్పుడేమో రూ.3వేల కోట్లు ఖర్చు పెడితే సరిపోతుందని అంటున్నారని చంద్రబాబుపై మండిపడ్డారు. అసలు ఏం మాట్లాడుతున్నారో చంద్రబాబుకే తెలియదన్నారు. అమరావతిలో రాజధాని నిర్మాణం అంత సులభం కాదన్నారు బొత్స. అమరావతి పొలాల్లో 130 అడుగుల లోతులో పునాదులు తవ్వాల్సి ఉంటుందన్నారు.
బొత్స కామెంట్స్:
* ఉద్యోగులను చంద్రబాబు ఉసిగొల్పుతున్నారు
* రైతుల దగ్గర చంద్రబాబు మొసలి కన్నీరు కారుస్తున్నారు
* శివరామకృష్ణ కమిటీ నిర్ణయం మేరకు అమరావతిలో రాజధాని పెట్టామన్నారు
* శివరామకృష్ణ కమిటీ ఏం చెప్పిందో అందరికీ తెలుసు
* పరిపాలన వికేంద్రీకరణ ఉండాలని శివరామకృష్ణ కమిటీ చెప్పింది
* విజయవాడ-గుంటూరు మధ్య రాజధాని సాధ్యం కాదని కమిటీ చెప్పింది
* శివరామకృష్ణ కమిటీ నివేదికను చంద్రబాబు తుంగలో తొక్కారు
* చంద్రబాబు అన్నీ తప్పుడు లెక్కలు చెబుతున్నారు
* రాజధానిలో తొలిదశలో రూ.52వేల కోట్లకు చంద్రబాబు టెండర్లు పిలిచారు
* రూ.842 కోట్ల ప్రజాధనాన్ని కేవలం కన్సల్టెంట్ల కోసం వృథా చేశారు
* ఇప్పటికే రూ.331 కోట్లు కన్సల్టెంట్లకు చెల్లించారు
* ఇప్పుడేమో రూ.3వేల కోట్లు ఖర్చు పెడితే సరిపోతుందని అంటున్నారు
* రైతుల దగ్గర తీసుకున్న పొలాల లేఅవుట్ లను అభివృద్ధి చేసేందుకు రూ.17వేల కోట్లు ఖర్చు చేయాలనుకున్నారు
* తిరుపతిలో తాగునీటి సమస్య పరిష్కరించేందుకు ఆదేశాలు ఇచ్చాం
* గరుఢవారధి పనులను పరిశీలించాం
* వినాయకసాగర్ అభివృద్ధికి త్వరలోనే టెండర్లు పిలుస్తాం
* రూ.9కోట్లతో ప్రకాశం పార్క్ అభివృద్ధి చేయబోతున్నాం
* మహిళా వర్సిటీ కన్వెన్షన్ సెంటర్ ను ఏర్పాటు చేస్తాం
* చంద్రబాబు ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు
* చంద్రబాబు అసహనంతో ఉన్నారు
* 4 పంటలు పండే చోట రాజధాని సరికాదని శివరామకృష్ణ కమిటీనే చెప్పింది
* చంద్రబాబు మరోసారి కమిటీ నివేదిక చదువుకోవాలి
* రాజధాని నిర్మాణానికి రూ.82వేల కోట్ల టెండర్లు ఎందుకు పిలిచారు
* ఇప్పుడు రూ.3 కోట్ల టెండర్లు చాలని ఎలా అంటారు
* కన్సల్టెంట్ల కోసమే రూ.842 కోట్లను చంద్రబాబు ఖర్చు పెట్టారు
* చంద్రబాబు అన్నీ తప్పుడు లెక్కలు చెబుతున్నారు
* అమరావతి పొలాల్లో 130 అడుగుల లోతులో పునాదులు తవ్వాలి
Also Read : మీ ఫోన్ ఇదేనా?: నో ఇంటర్నెట్.. వేగంగా Files షేర్ చేయొచ్చు!