JC Prabhakar Reddy : చీనా తోటకు వస్తున్నా…. దమ్ముంటే ఆపు : కేతిరెడ్డి పెద్దారెడ్డికి జేసీ ప్రభాకర్ రెడ్డి సవాల్

చీనా తోటలో పంట లేకుండానే ఎమ్మెల్యే పెద్దారెడ్డి పంట బీమా సొమ్ము కొట్టేశాడని ఆరోపించారు. ఏడాది వయస్సున్న చీనా చెట్లకు పంట నష్టం బీమా ఎలా వచ్చిందో అధికారులు చెప్పాలన్నారు.

JC Prabhakar Reddy : చీనా తోటకు వస్తున్నా…. దమ్ముంటే ఆపు : కేతిరెడ్డి పెద్దారెడ్డికి జేసీ ప్రభాకర్ రెడ్డి సవాల్

Prabhakar Reddy

JC Prabhakar Reddy Challenge : తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఏడాదిన్నర చీనా తోటకు పంట బీమా డబ్బులు కొట్టేశారని ఆరోపిస్తూ జేసీ ప్రభాకర్ రెడ్డి ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. పంటల బీమాలో రైతులకు న్యాయం జరగలేదని.. వైసీపీ నాయకులకే న్యాయం జరిగిందన్నారు. క్రాప్ ఇన్సూరెన్స్ రూపంలో 13.89 లక్షల రూపాయలు ఎమ్మెల్యే పెద్దారెడ్డి కొట్టేశాడని ఆరోపించారు. ఈ మేరకు ఆయన అనంతపురంలో మీడియాతో మాట్లాడారు.

ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంక్రట్రామిరెడ్డి తాడిపత్రికి వచ్చి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడని ఫైర్ అయ్యారు. “కారుకూతలు కూస్తున్నావ్.. నీ ధర్మవరం వస్తా… నీ ఇంటి దగ్గరకు వస్తా…. ఏం చేస్తావ్” అని ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంక్రట్రామిరెడ్డి సవాల్ చేశారు. ధర్మవరం ఎమ్మెల్యే వెంక్రట్రామిరెడ్డి లండన్ లో క్లబ్బుల్లో గ్లాసులు కడిగేవాడని ఎద్దేవా చేశారు.

Modi Surname Case: గుజరాత్ హైకోర్టులో రాహుల్ గాంధీకి ఎదురుదెబ్బ

ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి చీనా తోటకు వస్తున్నా…. దమ్ముంటే ఆపండి అని ఛాలెంజ్ చేశారు. చీనా తోటలో పంట లేకుండానే ఎమ్మెల్యే పెద్దారెడ్డి పంట బీమా సొమ్ము కొట్టేశాడని ఆరోపించారు. ఏడాది వయస్సున్న చీనా చెట్లకు పంట నష్టం బీమా ఎలా వచ్చిందో అధికారులు చెప్పాలన్నారు.

ఎమ్మెల్యే పెద్దారెడ్డికి ఇన్సూరెన్స్ డబ్బులు ఎలా వచ్చాయో….వచ్చే సోమవారం స్పందనలో ఫిర్యాదు చేస్తానని చెప్పారు. “నేను పోవటం కాదురా ఎమ్మెల్యే పెద్దారెడ్డి పాడె ఎత్తేందుకు నేను పోతా.. నేను తప్పు చెప్పానని నిరూపించాలి” అని పేర్కొన్నారు.