JC Prabhakar Reddy: తాడిపత్రిలో హైటెన్షన్.. మున్సిపల్ కమిషనర్ తీరును నిరసిస్తూ అర్థరాత్రి జేసీ నిరసన

మున్సిపాలిటీలో వాహనాల టైర్లు దొంగలించారని, వాహనాల డీజిల్ దొంగతనం జరిగిందని, అయినా కమిషనర్ పట్టించుకోవడంలేదంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

JC Prabhakar Reddy: తాడిపత్రిలో హైటెన్షన్.. మున్సిపల్ కమిషనర్ తీరును నిరసిస్తూ అర్థరాత్రి జేసీ నిరసన

JC Prabhakar Reddy

Updated On : April 25, 2023 / 11:20 AM IST

JC Prabhakar Reddy: అనంతపురం జిల్లా తాడిపత్రిలో జేసీ చేపట్టిన నిరసన కొనసాగుతూనే ఉంది. సోమవారం ఉదయం నుంచి తాడిపత్రిలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. తాడిపత్రి మున్సిపాలిటీలో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని, కమిషనర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, ఆయన వైఖరికి నిరసనగా మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి అర్థరాత్రి సమయంలో మున్సిపల్ కార్యాలయంలో మంచం వేసుకొని పడుకొని నిరసన తెలిపారు. ఉదయాన్నే కార్యాలయం ఆవరణలోనే బ్రష్ చేసి, స్నానం చేసి నిరసన తెలిపారు.

JC Prabhakar Reddy : జేసీ ప్రభాకర్‌రెడ్డి హౌస్ అరెస్ట్

మున్సిపాలిటీలో డీజిల్, టైర్ల అపహరణపై మున్సిపల్ కమిషనర్ బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తూ.. మున్సిపాలిటీలో జరుగుతున్న అక్రమాలకు నిరసనగా సోమవారం సాయంత్రం మున్సిపల్ కార్యాలయంకు వెళ్తున్న జేసీప్రభాకర్ రెడ్డిని పోలీసులు అడ్డుకొని గృహనిర్భందం చేశారు. దీనికి నిరసనగా ఆయన ఇంటి ముందు కాలేజీ కాఫౌండ్ పై పడుకొని నిరసన చేపట్టారు. సోమవారం అర్థరాత్రి వరకు జేసీ నిరసన కొనసాగింది. జేసీని ఇంట్లోకి వెళ్లాలని పోలీసులు సూచించినా జేసీ ప్రభాకర్ రెడ్డి తన నిరసనను కొనసాగించారు. దీంతో పోలీసులు జేసీని బలవంతంగా ఇంట్లోకి పంపించే ప్రయత్నం చేయడంతో పోలీసులకు, జేసీ అనుచరులకు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. ఇంటిముందు కాలేజీ కాంఫౌండ్‌పై పడుకొని నిరసన చేపట్టిన ప్రభాకర్ రెడ్డిని పోలీసులు బలవంతంగా లాకెళ్లి ఇంట్లో కూర్చోబెట్టారు.

Andhra pradesh : బోసుబొమ్మ సెంటర్ వద్ద తేల్చుకుందాం రండీ .. తిరువూరులో టెన్షన్ టెన్షన్

మున్సిపాలిటీలో వాహనాల టైర్లు దొంగలించారని, వాహనాల డీజిల్ దొంగతనం జరిగిందని, అయినా కమిషనర్ పట్టించుకోవడంలేదంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ కమిషనర్ తీరును ఎండకడుతు మున్సిపల్ కార్యాలయం ఆవరణంలో నిరసన నిద్ర చేసేందుకు వెళుతున్న జేసిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు జేసీకి మద్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో ఆయన అస్వస్థతకు గురయ్యారు. జేసీకి ఊపిరి ఆడక పోవడంతో ఆయన అనుచరులు విసనకర్రలతో గాలి ఊపారు.

Kedarnath temple: తెరుచుకున్న కేదార్‌నాథ్ ఆలయం తలుపులు..

తాడిపత్రిలో 30 యాక్ట్ అమలులో ఉన్నందున ఎలాంటి నిరసనలకు, ఆందోళనలకు పర్మీషన్ లేదంటుంన్న పోలీసులు పేర్కొంటున్నారు. తీవ్ర ఉద్రిక్తత నడుమ తెల్లవారు జామున 3 గంటలకు మున్సిపల్ కార్యాలయం ఆవరణంలో జేసీ మంచంపై పడుకొని నిరసన తెలిపారు. కమిషనర్ వచ్చి మున్సిపాలిటీలో జరిగిన అక్రమాలకు సమాధానం చెప్పేంత వరకు నా నిరసన కొనసాగిస్తానని జేసీ భీష్మించుకు కూర్చున్నారు.