JEE Advanced 2020 పరీక్ష..విద్యార్థులకు సూచనలు

JEE Advanced exam : కరోనా కారణంగా తాత్కాలికంగా నిలిచిపోయిన పరీక్షలు ఒక్కొక్కటిగా నిర్వహస్తున్నారు అధికారులు. 2020, సెప్టెంబర్ 27వ తేదీ ఆదివారం జేఈఈ అడ్వాన్స్ డ్ పరీక్ష జరుగనుంది. ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు.. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)ల్లో ప్రవేశానికి ఈ పరీక్ష నిర్వహిస్తారనే సంగతి తెలిసిందే. ఏపీలో 30 చోట్ల పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు.
పేపర్–1 ఉదయం 9 గంటల నుంచి, పేపర్–2 మధ్యాహ్నం 2.30 గంటల నుంచి ప్రారంభమవుతాయి. రెండు పేపర్లు తప్పనిసరిగా రాయాల్సి ఉంటుంది. ఇక ప్రతి ఎగ్జామ్స్ కు విధంచే ఒక్క నిమిషం నిబంధన ఈ పరీక్షకు వర్తింప చేయనున్నారు.
దేశవ్యాప్తంగా ఈ పరీక్షకు 2.50 లక్షల మంది అర్హత సాధించినా 1.60 లక్షల మంది మాత్రమే దరఖాస్తు చేశారు. ఉదయం 7 గంటలకల్లా అభ్యర్థులు పరీక్ష కేంద్రాల్లో రిపోర్ట్ చేయాలి.
విద్యార్థులకు సూచనలు : –
⇒ షూస్ ధరించకుండా..సాధారణ చెప్పులు వేసుకోవాలి.
⇒ కోవిడ్–19 సెల్ఫ్ డిక్లరేషన్ ఫారం కూడా సమర్పించాలి.
⇒ మాస్కు ధరించడంతోపాటు శానిటైజర్, వాటర్ బాటిళ్లు తెచ్చుకోవాలి.
⇒ ఆరడుగుల భౌతికదూరం పాటించాలి. కేటాయించిన సీట్ల వద్ద
⇒ కంప్యూటర్ స్క్రీన్‌పై అభ్యర్థి పేరు, ఫొటో, జేఈఈ రోల్ నంబర్ కనిపిస్తాయి.
⇒ అభ్యర్థులు అడ్మిట్‌కార్డుతో పాటు ఇతర అధికారిక గుర్తింపుకార్డు తీసుకురావాలి.
⇒ గుర్తింపు ప్రక్రియ పూర్తయ్యాక పరీక్ష సమయానికి అరగంట ముందు పరీక్ష హాలులోకి అనుమతిస్తారు.
⇒ రోల్ నంబర్, పుట్టిన తేదీని నమోదు చేసి లాగిన్ కావచ్చు.