Jogi Ramesh : దాడి చేస్తారని నీకంత భయముంటే నేనొచ్చి వారాహి యాత్రను నడిపిస్తా- పవన్ కామెంట్స్‌కు మంత్రి జోగి రమేశ్ కౌంటర్

కత్తులు కటారులు తేవాల్సిన అవసరం పెడన ప్రజలకు లేదు. పెడనలో హింస రేకెత్తించడానికి పవన్ కుట్ర చేస్తున్నారు. Jogi Ramesh

Jogi Ramesh : దాడి చేస్తారని నీకంత భయముంటే నేనొచ్చి వారాహి యాత్రను నడిపిస్తా- పవన్ కామెంట్స్‌కు మంత్రి జోగి రమేశ్ కౌంటర్

Jogi Ramesh Counter To Pawan Kalyan (Photo : Google)

Jogi Ramesh – Pawan Kalyan : పెడన వారాహి యాత్రలో తనపై రాళ్ల దాడి జరగబోతుందని, 3వేల మంది తనపై దాడి చేసేందుకు వైసీపీ ప్లాన్ చేసిందని, దీనికి సంబంధించి తనకు సమాచారం ఉందని, తనకు ఏం జరిగినా ప్రభుత్వానిదే బాధ్యత అంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపాయి.

దీనిపై మంత్రి, పెడన ఎమ్మెల్యే జోగి రమేశ్ తీవ్రంగా స్పందించారు. పెడన సభలో తనపై దాడి జరగబోతుంది అంటూ పవన్ కల్యాణ్ కట్టు కథ చెబుతున్నారు అని మంత్రి జోగి రమేశ్ ధ్వజమెత్తారు. ఆడలేక మద్దెల దరువు సామెత పవన్ కి సరిగ్గా సూట్ అవుతుందని విమర్శించారు.

Pawan Kalyan : పెడనలో నాపై రాళ్లదాడి చేస్తారని సమాచారం, నాకేం జరిగినా వాళ్లదే బాధ్యత : పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు

మా వాళ్లకు కత్తులు, కటార్లు అవసరం లేదు:
”పవన్ మాటలు కోటలు దాటతాయి. చేతలు మాత్రం శూన్యం. అవనిగడ్డలో జనం రాలేదని పెడన సభ కోసం ఇలాంటి డ్రామాకు తెరలేపారు. కత్తులు కటారులు తేవాల్సిన అవసరం పెడన ప్రజలకు లేదు. మా పెడన నియోజకవర్గంలో అంతా శాంతిపరులు. రైతులు, చేనేత కార్మికులు. పెడన సభ విజయవంతం చేసుకోడానికి ఇదొక చీప్ ట్రిక్. పెడనలో హింస రేకెత్తించడానికి పవన్ కుట్ర చేస్తున్నారు.

పవన్.. నీకు దమ్ముంటే..
విధ్వంసకర పరిస్థితి సృష్టించాలని చూస్తున్నారు. పవన్ కి అంత భయం ఉంటే నేను వచ్చి వారాహి యాత్రను ముందుకు నడిపిస్తా. పవన్ కి దమ్ముంటే దాడి ప్లాన్ చేసినట్టు చిన్న ఆధారం చూపించాలి. 2వేల మంది వచ్చారని చెబుతున్న పవన్ ఎవరో చూపించు. వాళ్ళని అరెస్టు చేయిస్తా. పవన్ కళ్యాణ్ ఇలాంటి పనికిమాలిన రాజకీయాలు మానుకోవాలి” అని ఫైర్ అయ్యారు మంత్రి జోగి రమేశ్.

Also Read..AP Politics: ఏపీలో రాజకీయ కురుక్షేత్రం.. నారా భువనేశ్వరి, బ్రాహ్మణిలే నెక్ట్స్‌ టార్గెట్?