భక్తుల ఆరోగ్యంతో వ్యాపారుల చెలగాటం.. ద్వారకా తిరుమలలో దారుణం

భక్తుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఆలయ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఆ వెంటనే ఆ షాపును సీజ్ చేశారు.

భక్తుల ఆరోగ్యంతో వ్యాపారుల చెలగాటం.. ద్వారకా తిరుమలలో దారుణం

Expire Milk : కాసుల కక్కుర్తితో వ్యాపారులు దిగజారిపోతున్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. నాసిరకం, నాణ్యత లేని, ఎక్స్ పైర్ అయిన ఆహార పదార్ధాలు వినియోగిస్తున్నారు. పాడైపోయినా, కుళ్లిపోయినా పారేయకుండా వాటినే కస్టమర్లకు అంటగడుతున్నారు. ఈ విషయం తెలియని కస్టమర్లు వాటిని తిని జబ్బుల బారిన పడుతున్నారు. అనారోగ్యంతో ఆసుపత్రి పాలవుతున్నారు.

తాజాగా ఏలూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల కొండపై ఉన్న దుకాణాల్లో దారుణం వెలుగుచూసింది. కొందరు వ్యాపారులు భక్తుల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారు. ఎక్స్ పైర్ అయిన పాలను పారేయకుండా అలానే జ్యూస్ తయారీలో వాడుతున్నారు. ఇలాంటి జ్యూస్ తాగితే జబ్బుల బారిన పడటం ఖాయం అంటున్నారు డాక్టర్లు.

ద్వారకా తిరుమల కొండపై దేవస్థానం అధికారులు తనిఖీలు చేపట్టారు. ఓ షాపులో ఎక్స్ పైర్ పాల ప్యాకెట్లతో జ్యూస్ తయారు చేస్తున్నారని భక్తులు ఇచ్చిన ఫిర్యాదుతో అధికారులు సోదాలు జరిపారు. ఈ సోదాల్లో భారీగా ఎక్స్ పైర్ అయిన పాల ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. చిన్న వెంకన్న దర్శనం కోసం ఓ భక్తుడు ద్వారకా తిరుమల వెళ్లాడు. కొండపై ఉన్న ఓ షాపులో జ్యూస్ ఆర్డర్ ఇచ్చాడు. స్టాల్ నిర్వాహకుల వద్ద ఉన్న పాల ప్యాకెట్లను పరిశీలించిన అతడు షాక్ కి గురయ్యాడు. అందులో ఎక్స్ పైర్ డేట్ అయిపోయినట్లుగా గుర్తించాడు. వెంటనే అతడు ఆలయ అధికారులకు ఫిర్యాదు చేశాడు. భక్తుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఆలయ అధికారులు తనిఖీలు చేపట్టగా 217 గడువు తీరిన పాల ప్యాకెట్లు గుర్తించారు. ఆ వెంటనే ఆ షాపును సీజ్ చేశారు.

Also Read : కిచెన్‌లో ఎలుకలు, బొద్దింకలు.. ఫ్రీజర్‌లో కుళ్లిన చికెన్, మటన్.. హైదరాబాద్ హోటల్స్, రెస్టారెంట్లలో దారుణ పరిస్థితులు