Vijayawada Indrakeeladri : ఇంద్రకీలాద్రిపై సీజేఐ దంపతులు…దుర్గమ్మ దర్శనం

ఆశీర్వాద మండపంలో వేదపండితులచే వెంకటరమణ దంపతులకు వేద ఆశీర్వచనం చేశారు...శనివారం కనకదుర్గ అమ్మవారిని ఆయన సతీసమేతంగా దర్శించుకున్నారు.

Vijayawada Indrakeeladri : ఇంద్రకీలాద్రిపై సీజేఐ దంపతులు…దుర్గమ్మ దర్శనం

Cji

Updated On : December 25, 2021 / 2:14 PM IST

Justice NV Ramana : భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ ఏపీ రాష్ట్ర పర్యటన కొనసాగుతోంది. తన సొంతూరులో పర్యటించిన ఆయన..ఇంద్రకీలాద్రికి వచ్చారు. 2021, డిసెంబర్ 25వ తేదీ శనివారం కనకదుర్గ అమ్మవారిని ఆయన సతీసమేతంగా దర్శించుకున్నారు. ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న జస్టిస్ వెంకటరమణ దంపతులకు రాష్ట్ర సమాచార పౌరసంబంధాల శాఖా మంత్రి పేర్ని వెంకటరామయ్య (నాని) స్వాగతం పలికారు. ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ పైలా సోమినాయుడు, ఆలయ ఈవో భ్రమరాంబ, అర్చకులు ఆలయ మర్యాదలతో పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.

Read More : TRS Vs BJP : ఎవరికీ బెదరం..టీఆర్ఎస్ కంచుకోట లాంటిది – హరీష్ రావు

అనంతరం వెంకటరమణ దంపతులకు అంతరాలయంలో అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆశీర్వాద మండపంలో వేదపండితులచే వెంకటరమణ దంపతులకు వేద ఆశీర్వచనం చేశారు. తర్వాత..అమ్మవారి చిత్రపటాన్ని, తీర్ధ ప్రసాదాలను అందజేశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వెంట ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, తెలంగాణా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, తెలంగాణా హైకోర్టు జడ్జి లలిత కన్నెగంటి, ఆంధ్రప్రదేశ్ తెలంగాణా హైకోర్టు రిజిస్ట్రార్లు, విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని నాని, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి వాణిమోహన్, కమీషనర్ హరిజవహర్ లాల్, జిల్లా కలెక్టర్ జె.నివాస్, నగర పోలీస్ కమీషనర్ కాంతిరాణా టాటా, తదితరులు పాల్గొన్నారు.