KA Paul: జగన్ ఢిల్లీ పర్యటన ఇందుకు కాదు: కేఏ పాల్

చంద్రబాబు బెయిల్ కోసం దేవుడిని ప్రార్థించుకోవాలని కేఏ పాల్ అన్నారు.

KA Paul: జగన్ ఢిల్లీ పర్యటన ఇందుకు కాదు: కేఏ పాల్

KA Paul

Updated On : October 5, 2023 / 3:03 PM IST

CM Jagan Delhi Tour: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన వేళ ఆయనపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ విమర్శలు గుప్పించారు. జగన్ ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నారని ప్రజలు సందేహిస్తున్నారని కేఏ పాల్ చెప్పారు. రూ.10 లక్షల కోట్ల అప్పు ఎలా తీర్చాలనే ఉద్దేశంతో ఆయన వెళ్లడం లేదని తెలిపారు. సొంత ప్రయోజనాల కోసమే ఢిల్లీలో పర్యటిస్తున్నారని చెప్పారు.

అలాగే, ఇప్పటివరకు ప్రత్యేక హోదా వంటి ఏ కలా నెరవేరలేదని కేఏ పాల్ విమర్శించారు. అభివృద్ధిలో ఆంధ్ర, తెలంగాణ దిగజారిపోయాయని చెప్పారు. కేవలం అధికారం కోసమే వైసీపీ, టీడీపీ, బీఆర్ఎస్ పని చేస్తున్నాయని, దోచుకున్న డబ్బును ఎలా దాచుకోవాలని ఆ పార్టీల నేతలు ఆలోచిస్తున్నారని ఆరోపించారు.

చంద్రబాబు బెయిల్ కోసం దేవుడిని ప్రార్థించుకోవాలని కేఏ పాల్ అన్నారు. జైలుకు వెళ్లనని చంద్రబాబు అనుకున్నారని చెప్పారు. ఆయనను టీడీపీ నుంచి బీజేపీలోకి వెళ్లినవారు కాపాడతారని భావించారని తెలిపారు. అలాగే, ప్యాకేజీ స్టార్ అరెస్ట్ నుంచి కాపాడతారని చంద్రబాబు అనుకున్నారని చెప్పారు.

ఈ విషయంలో పవన్ కి బీజేపీ కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదని కేఏ పాల్ అన్నారు. కాంగ్రెస్‌కి చిరంజీవి అమ్ముడుపోతే.. చంద్రబాబుకు పవన్ అమ్ముడుపోయారని చెప్పారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, అమ్మకాన్ని తానే ఆపానని తెలిపారు. తెలంగాణ ప్రజలను తాను నమ్ముతున్నానని, ఢిల్లీలో ఆప్ ని గెలిపించినట్లు రాష్ట్రంలో ప్రజాశాంతి పార్టీని గెలిపిస్తారని భావిస్తున్నానని చెప్పారు.

Warangal: ఎమ్మెల్యే రాజయ్యను పక్కన పెట్టడంతో.. టెన్షన్ పడుతున్న ఎంపీ దయాకర్‌!