MLA Dwarampudi : పెదనాన్న, తమ్ముడు అనుమతి తీసుకొని పవన్ నాపై పోటీ చేయాలి!
పవన్ కళ్యాణ్‌కు స్క్రిప్ట్ టీడీపీ ఆఫీస్ నుంచి వస్తుంది. వారు ఇచ్చినట్లుగా వారాహి యాత్రలో చదువుతూ నాపై పవన్ లేనిపోనీ నిందలు వేస్తున్నాడు అంటూ కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి విమర్శించారు.

MLA Dwarampudi Chandrasekhar Reddy
MLA Chandrasekhar Reddy: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాకినాడలో వారాహి విజయ యాత్రలో చేసిన ఆరోపణలకు కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కౌంటర్ ఇస్తూనే ఉన్నారు. తాజాగా మరోసారి పవన్ కళ్యాణ్‌పై ద్వారంపూడి విమర్శల దాడి చేశారు. నారావారి వాహనంలో పవన్ కళ్యాణ్ ద్వారంపూడి జపం చేస్తున్నాడు అంటూ ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ కాకినాడలో పోటీ చేసి గెలవాలని నేను సవాల్ చేసినా స్పందన లేదు. చంద్రబాబు పెదనాన్న, లోకేష్ తమ్ముడు అనుమతి తీసుకుని పవన్ కళ్యాణ్ కాకినాడలో నాపై పోటీ చేయాలి అంటూ ద్వారంపూడి ఎద్దేవా చేశారు.
పవన్ కళ్యాణ్‌కు స్క్రిప్ట్ టీడీపీ ఆఫీస్ నుంచి వస్తుంది. వారు ఇచ్చినట్లుగా వారాహి యాత్రలో చదువుతూ నాపై పవన్ లేనిపోనీ నిందలు వేస్తున్నాడు అంటూ ద్వారంపూడి విమర్శించారు. పవన్ వ్యక్తిగతంగా ఉంటే మనం మనం చూసుకుందాం. పవన్ తన వ్యాఖ్యలతో కాకినాడకు చెడ్డ పేరు తీసుకువస్తున్నారు. పవన్ కొంచెం జ్ఞానంతో మాట్లాడు అంటూ ద్వారంపూడి సూచించారు. బెస్ట్ లివింగ్ సిటీ ఆఫ్ ఇండియాగా కాకినాడ నాలుగవ స్థానంలో ఉంది.
పండించిన పంట మాకు ఇవ్వడానికి రైతులు అమాయకులా? ఇరవై ఏళ్ళుగా మా కుటుంబం రైస్ బిజినెస్‌లో లేము, ఎగుమతులు మాత్రం చేస్తున్నాము. కాకినాడ పోర్ట్ నుంచి ఎగుమతి అవుతున్న రైస్‌లో 90శాతం బయట రాష్ట్రాలు నుండి వస్తుందని ద్వారంపూడి అన్నారు. ముందు అసలు మేం ఏం చేస్తున్నామో తెలుసుకో.. ఇష్టమొచ్చినట్లు అవగాహన లేకుండా మాట్లాడకు పవన్ అంటూ ద్వారంపూడి సూచించారు.