Kesineni Chinni: వాటితో చంద్రబాబుకు ఏం సంబంధం? కేశినేని నానికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన కేశినేని చిన్ని

నందమూరి, నారా కుటుంబాలను అనే అర్హత, స్థాయి కేశినేని నానికి లేదని, చంద్రబాబు పెట్టిన రాజకీయ బిక్ష మరిచి కేశినేని నాని మాట్లాడుతున్నాడని కేశినేని చిన్ని విమర్శించారు.

Kesineni Chinni: వాటితో చంద్రబాబుకు ఏం సంబంధం? కేశినేని నానికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన కేశినేని చిన్ని

Kesineni Chinni

Updated On : January 11, 2024 / 12:04 PM IST

AP Politics : ఎంపీ కేశినేని నాని టీడీపీకి రాజీనామా చేసి బుధవారం సీఎం జగన్ మోహన్ రెడ్డిని కలిసిన విషయం తెలిసిందే. జగన్ తో భేటీ తరువాత ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. నాని వ్యాఖ్యలకు ఆయన తమ్ముడు, టీడీపీ నేత కేశినేని శివనాథ్ (చిన్ని) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మా కుటుంబంలో విబేధాలు రావడానికి చంద్రబాబు కారణమని కేశినేని నాని అనడం సరికాదని అన్నారు. మా కుటుంబ కలహాలు 1999 నుంచి ఉన్నాయని.. చంద్రబాబు కేం సంబంధం ఉంటుందని అన్నారు. నాని నన్ను ఎన్నిఅన్నా 1999 నుంచి నేను సర్దుకుంటూ వచ్చానని చిన్ని చెప్పారు.

Also Read : PVP Setire On Kesineni Nani : బండి షెడ్డు మారిందంతే! కేశినేని నానిపై పీవీపీ సెటైర్

నందమూరి, నారా కుటుంబాలను అనే అర్హత, స్థాయి కేశినేని నానికి లేదని, చంద్రబాబు పెట్టిన రాజకీయ బిక్ష మరిచి కేశినేని నాని మాట్లాడుతున్నాడని కేశినేని చిన్ని విమర్శించారు. ఎంతో మంది మహామహులు తెలుగుదేశం పార్టీని వీడినా పార్టీకి ఏం కాలేదని, వచ్చే వాళ్లు వస్తుంటారు.. పోయేవాళ్లు పోతుంటారు. ఇప్పటి వరకూ తెలుగుదేశంను ఏం చేయలేక పోయారని చిన్ని అన్నారు. యువగళం పాదయాత్రలో నారా లోకేశ్ వెంట లక్షలాది మంది ప్రజలు, కార్యకర్తలు నడిచారు. విజయవాడకు హెచ్ సీఎల్ సహా ఎన్నో సంస్థలు వచ్చాయంటే దానికి ఆయనే కారణమని చిన్ని అన్నారు. అమరావతిని సర్వనాశనం చేసిన జగన్ చెంతకు నాని చేరడాన్ని విజయవాడ ప్రజలు హర్షించరని కేశినేని చిన్ని వ్యాఖ్యానించారు.

Also Read : పార్లమెంట్ ఎన్నికల ముందు గ్రేటర్‌లో బీజేపీకి షాక్.. రాజీనామా చేసిన కీలక నేత

బుద్దా వెంకన్న ఆగ్రహం..
కేశినేని నానిపై టీడీపీ నేత బుద్దా వెంకన్న తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కేశినేని నాని నువ్వు వైసీపీ కోవర్ట్ అని తేలిపోయింది. కొడాలి నాని, వల్లభనేని వంశీ మాట్లాడే మాటల్లో నీకుకూడా భాగం ఉందని తేలిపోయింది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని నాశనం చేయడానికి వెల్లంపల్లికి అనుకూలంగా పనిచెయ్యడానికి నీ బ్లాక్ మెయిల్ రాజకీయాలతో విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి కో- ఆర్డినేటర్ గా వేయించుకున్న రోజే నాకు తెలుసు. కానీ, నా బాస్ చంద్రబాబుపై ఉన్న గౌరవంతో ఏం మాట్లాడకుండా ఉన్నాను. ఈరోజు ప్రజలకు, ప్రజలకు, తెలుగుదేశం పార్టీ సైనికులకు కూడా తెలిసిందని బుద్దా అన్నారు.