బండి షెడ్డు మారిందంతే! కేశినేని నానిపై పీవీపీ సెటైర్

నాలుగు రోజుల క్రితం కేశినేని నాని టీడీపీకి, ఎంపీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానంటూ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ ను కేవీపీ ట్యాగ్ చేసి కేశినేని నానిపై విమర్శలు చేశారు.

బండి షెడ్డు మారిందంతే! కేశినేని నానిపై పీవీపీ సెటైర్

PVP and Kesineni Nani

Updated On : January 11, 2024 / 12:31 PM IST

Kesineni Nani : ఎంపీ కేశినేని నాని టీడీపీకి రాజీనామా చేసి బుధవారం సీఎం జగన్ మోహన్ రెడ్డిని కలిసిన విషయం తెలిసిందే. జగన్ తో భేటీ తరువాత ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. నాని వ్యాఖ్యలకు టీడీపీ నేతలు కౌంటర్ ఇచ్చారు. తాజాగా వైసీపీ నేత పొట్లూరి వరప్రసాద్ (పీవీపీ) ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు. కేశినేని నానిపేరు ప్రస్తావించకుండానే సెటైర్ వేశారు. ‘బోరుకొచ్చిన బండి షెడ్డు మారిందంతే.. వీడి గుడిసేటి బుద్ధి గురించి బెజవాడంతా తెలుసుకదరా అబ్బాయ్!!’ అంటూ పీవీపీ ట్వీట్ లో పేర్కొన్నారు.

Also Read : Telangana BJP : పార్లమెంట్ ఎన్నికల ముందు గ్రేటర్‌లో బీజేపీకి షాక్.. రాజీనామా చేసిన కీలక నేత

2019 ఎన్నికల్లో విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీచేసిన పీవీపీపై టీడీపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన కేశినేని నాని విజయం సాధించిన విషయం తెలిసిందే. 2019 ఎన్నికల తరువాత పీవీపీ పెద్దగా ఎక్కడా కనిపించలేదు. తాజాగా.. కేశినేని నాని సీఎం జగన్ ను కలిశారు. విజయవాడ పార్లమెంట్ స్థానం నుంచి నాని వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతారని ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలో పీవీపీ చేసిన ట్వీట్ ఏపీ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. ఇదిలాఉంటే.. గత నాలుగు రోజుల క్రితంసైతం నానిపై పీవీపీ ట్విటర్ వేదికగా విమర్శలు చేశారు.

Also Read : Kesineni Nani vs Buddha Venkanna : డైలాగ్ వార్… కేశినేని నాని vs బుద్దా వెంకన్న

నాలుగు రోజుల క్రితం కేశినేని నాని టీడీపీకి, ఎంపీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానంటూ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ ను కేవీపీ ట్యాగ్ చేసి కేశినేని నానిపై విమర్శలు చేశారు. ‘కేశినేని నాని పీపాల బస్తా, బెజవాడకే గుదిబండలా తయారయ్యావ్ నువ్వు.. ఏదో మచ్చ ఏసుకుని పుట్టావు, పార్టీ పుణ్యమా అని పదేళ్లు బండి కొనసాగించావు, బ్యాంకులను బాదావు, జనాలని, ఉద్యోగులని పీల్చి పిప్పిచేసావు.. ఇకనైనా ఒట్టి మాటలు కట్టిపెట్టి, అన్ని మూసుకుని మూలపడుండు’ అంటూ పీవీపీ ట్వీట్ లో పేర్కొన్నాడు.