TTD : టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు, శానిటరీ కార్మికుల జీతం పెంపు
టీడీపీ పాలక మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. దీంట్లో భాగంగా అలిపిరి వద్ద శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ యాగం నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది.

TTD
TTD Governing body : టీడీపీ పాలక మండలి సమావేశమైంది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంది. దీంట్లో భాగంగా అలిపిరి వద్ద శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ యాగం నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. భక్తులు తమ పేరుపై చేసుకునే విధంగా నిరంతరాయ యాగం చేయాలని..టీటీడీలో శానిటరీ కార్మికుల జీతం రూ. 12,000 నుండి రూ.17 వేలకు పైగా పెంచాలని నిర్ణయం
తీసుకుంది. ఈ నిర్ణయంతో 5 వేల మంది కార్మికులకు ఉపయోగకంగా ఉండనుంది.
శ్రీ లక్ష్మి మాన్ పవర్ కార్పొరేషన్ కు ఉద్యోగులకు ప్రతి సంవత్సరం 3 శాతం పెంచాలే నిర్ణయించింది. వివిధ కాంట్రాక్టు ఉద్యోగులకు కూడా 2 సంవత్సరాలకు 3 శాతం జీతం పెంపుకు నిర్ణయించింది. రూ.18 కోట్లతో వ్యయంతో నారాయణ గిరి వద్ద భక్తుల కోసం ఆధునాతన కాంప్లెక్స్ భక్తులకోసం నిర్మాణం చేపట్టాలనే కీలక నిర్ణయం తీసుకుంది.పాపవినాశనం వరకు రూ.40 కోట్లతో 4 లైన్ రోడ్డు, వరాహ అతిథి గృహం వద్ద రూ.10.50 కోట్లతో నుండి రోడ్డు విస్తరణ పనులు,తిరుపతి పట్టణ పారిశుధ్యం మెరుగు పరిచాలని బోర్డు నిర్ణయించింది.
తిరుపతి పట్టణ పారిశుధ్యం మెరుగు పరుచు టలో భాగంగా టీటీడీ బాగ స్వామ్యం చేయాలని నిర్ణయించింది.టీటీడీ మొత్తం బడ్జెట్ లో 1 శాతం తిరుపతి అభివృద్ధికి ఇవ్వాలని..చేర్లో పల్లి మంగాపురం రోడ్డు విస్తరణ కోసం రూ.25 కోట్లు కేటాయించాలని నిర్ణయించింది.టీటీడీ కల్యాణ మండపాల్లో జరిగే కార్య క్రమాలు భక్తి పాటలే ఉండాలని నిర్ణయంతో పాటు టిటిడి ఆస్థాన విద్వాంసుడు గరిమేళ్ల బాలకృష్ణ ప్రసాద్ గారికి పద్మశ్రీ ఇవ్వాలని కేంద్రాని కోరాలని పాలకమండలి తీర్మానం చేసింది.