Tirupati Boy Safe : తిరుపతి బస్టాండ్ లో కిడ్నాపైన బాలుడు క్షేమం
శ్రీవారి దర్శనం ముగించుకున్న బాలుడి కుటుంబం తిరిగి చెన్నైకి వెళ్తున్నారు. రాత్రి 12 గంటల సమయంలో తిరుపతి బస్టాండ్ కు చేరుకుంది.

boy kidnapped
Tirupati Boy Safe : తిరుపతి బస్టాండ్ లో కిడ్నాపైన బాలుడి ఆచూకీ లభించింది. తిరుపతిలో ఈ ఉదయం కిడ్నాప్ కు గురైన రెండేళ్ల బాలుడు అరుణ్ మురుగన్ క్షేమం ఉన్నాడు. ప్రస్తుతం ఏర్పేడు పోలీసుల అదుపులో బాలుడు ఉన్నాడు. తిరుపతిలో బాలుడిని కిడ్నాప్ చేసిన కిడ్నాపర్ ఏర్పేడులో ఉన్న తన అత్తకు అప్పగించారు. అయితే కిడ్నాపర్ అత్త బాలుడిని ఏర్పేడు పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చారు. కాసేపట్లో తిరుపతికి బాలుడిని తీసుకురానున్నారు.
తిరుపతి బస్టాండ్ లో రెండేళ్ల బాలుడు అరుణ్ మురుగన్ కిడ్నాప్ కు గురయ్యాడు. తెల్లవారుజామున 2 గంటలకు బాలుడు అరుణ్ మురుగన్ ను గుర్తు తెలియని వ్యక్తి తీసుకెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. తమిళనాడు రాజధాని చెన్నై నుంచి అరుణ్ మురుగన్ కుటుంబం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
Bengal: 8వ తరగతి విద్యార్థి కిడ్నాప్, హత్య.. తోటి పిల్లలే నిందితులు
శ్రీవారి దర్శనం ముగించుకున్న బాలుడి కుటుంబం తిరిగి చెన్నైకి వెళ్తున్నారు. బాలుడి కుటుంబం రాత్రి 12 గంటల సమయంలో తిరుపతి బస్టాండ్ కు చేరుకుంది. అయితే అర్ధరాత్రి కావడంతో బస్టాండ్ లోనే బాలుడి కుటుంబ సభ్యులు నిద్రపోయారు. తెల్లవారుజామున 2 – 2.20 గంటల సమయంలో బాలుడిని గుర్తు తెలియని వ్యక్తి ఎత్తుకెళ్లారు.
బాలుడిని కిడ్నాప్ చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. కాగా, బాలుడి కిడ్నాప్ వెనుక ఓ మహిళతో పాటు మరో ఇద్దరు వ్యక్తులు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రత్యేక పోలీస్ బృందాలు బాలుడు ఆచూకీ గుర్తించే పనిలో ఉన్నాయని సీఐ మహేశ్వర్ రెడ్డి అంటున్నారు.