Kinjarapu Atchannaidu : సీఐడీ చెప్పినట్లు టీడీపీ ఖాతాలోకి రూ.27కోట్లు వచ్చింది నిజమే- అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు

చంద్రబాబు అరెస్టుకు కారణాలు చూపలేక మరో తప్పుడు ప్రచారంతో జగన్ ప్రభుత్వం అడ్డంగా బుక్కైందన్నారు. Kinjarapu Atchannaidu

Kinjarapu Atchannaidu : సీఐడీ చెప్పినట్లు టీడీపీ ఖాతాలోకి రూ.27కోట్లు వచ్చింది నిజమే- అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు

Kinjarapu Atchannaidu (Photo : Google)

Updated On : October 5, 2023 / 8:16 PM IST

Kinjarapu Atchannaidu – CID : స్కిల్ డెవలప్ మెంట్ కేసు విచారణలో భాగంగా టీడీపీ ఖాతాలోకి రూ.27 కోట్లు వెళ్లాయని సీఐడీ తరపు న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఏసీబీ కోర్టు దృష్టికి తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన డాక్యమెంట్లను కూడా ఆయన కోర్టుకి సమర్పించారు. ఈ వ్యవహారంపై ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్పందించారు. హాట్ కామెంట్స్ చేశారాయన. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఆధారాలు చూపలేక మరోసారి సీఐడీ బోల్తా పడిందన్నారాయన.

చంద్రబాబు అరెస్టుకు కారణాలు చూపలేక మరో తప్పుడు ప్రచారంతో జగన్ ప్రభుత్వం అడ్డంగా బుక్కైందన్నారు. 2018లో రూ.27 కోట్లు టీడీపీకి అందాయి అంటూ సీఐడీ కోర్టులో చెప్పిందని.. దాని గురించి ఆరా తీస్తే తీరా ఆ రూ.27 కోట్లు పార్టీకి వచ్చిన ఎలక్టోరల్ బాండ్స్ గా నిర్థారణ అయ్యందన్నారు అచ్చెన్నాయుడు. చంద్రబాబుపై కేసులో ఆధారాలు చూపలేక రాజకీయ పార్టీలకు వచ్చే విరాళాలే అక్రమాలని కట్టు కథ అల్లారని అచ్చెన్నాయుడు చెప్పారు.

Also Read..Janasena: చిత్తూరు జిల్లాలో మూడు సీట్లపై జనసేన గురి.. డైలమాలో టీడీపీ నేతలు!

”ఎలక్షన్ కమిషన్ వెబ్ సైట్ నుంచి అధికారికంగా లభించే డాక్యుమెంట్ తీసుకుని అవే లంచం అంటూ సీఐడీ వాదించింది. పెద్ద మొత్తంలో నగదు అని ప్రచారం చేసి.. చివరికి అధికారికంగా వచ్చే విరాళాలనే స్కామ్ అంటూ వాదనలు వినిపించారు. 20వేలు పైన నగదు రూపంలో ఇచ్చే ప్రతి విరాళం ఇన్ కమ్ ట్యాక్స్ కి, ECI ఇవ్వాలని నిబంధన ఉంది. ఆ ప్రకారం అన్ని వివరాలను టీడీపీ వెల్లడించింది. టీడీపీకి రూ.27 కోట్లు విరాళం వచ్చింది. అదే ఏడాది వైసీపీకి బాండ్స్ రూపంలో 99 కోట్లు విరాళం వచ్చింది” అని అచ్చెన్నాయుడు తెలిపారు.

వైసీపీకి ఏడాదికి ఎంత విరాళం వచ్చిందో చెబుతూ వివరాలు విడుదల చేసిన టీడీపీ. రాజకీయ పార్టీగా టీడీపీకి వచ్చిన విరాళాన్ని లంచం అంటూ సీఐడీ బుకాయిస్తోందని అచ్చెన్నాయుడు ఆరోపించారు. వైసీపీకి వచ్చిన రూ.330.44 కోట్ల ఎలక్టోరల్ బాండ్స్ లెక్క ఏమిటని టీడీపీ ప్రశ్నిస్తోంది. స్కిల్ కేసులో రూ.370 కోట్లు చంద్రబాబు కొట్టేశారని ఇప్పటివరకు చెప్పిన సీఐడీ.. నేడు నిబంధనల ప్రకారం వచ్చిన బాండ్స్ ను చూపించి రూ.27 కోట్లు పార్టీ ఖాతాకు వచ్చాయని వాదించడం విడ్డూరంగా ఉందని టీడీపీ శ్రేణులు అంటున్నాయి.

Also Read..Pawan Kalyan: సైకిల్-గ్లాసు కాంబినేషన్‌పై కొత్త స్లోగన్.. బీజేపీపై పవన్ వైఖరి మారిందా?