ఏపీలో కూటమి సునామీ.. కేకే చెప్పిందే అక్షరాల నిజమైంది..!

కేకే ఎగ్జిట్ పోల్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. అంకెలతో సహా ఇంత కరెక్ట్ గా చెప్పింది ఎవరూ లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఏపీలో కూటమి సునామీ.. కేకే చెప్పిందే అక్షరాల నిజమైంది..!

KK Survey : ఏపీలో టీడీపీ కూటమి సునామీ సృష్టించింది. ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి సంచలన విజయం నమోదు చేసింది. కాగా, కూటమి ఘన విజయాన్ని ఆ పార్టీ నేతలు కూడా ఊహించలేదు. అయితే ఒక వ్యక్తి మాత్రం ముందే చెప్పాడు. ఫలితాల్లో కూటమి సునామీ సృష్టించబోతోందని అంకెలతో సహా అంచనా వేశాడు. అతడే కేకే..

అవును.. కూటమి విక్టరీని కేకే సర్వే ముందే చెప్పింది. ఆయన ఇచ్చిన ఎగ్జిట్ పోల్ అక్షరాలా నిజమైంది. కేకే చెప్పినట్లే కూటమి గెలిచింది. కాదు కాదు.. సునామీ సృష్టించింది. అంతేకాదు.. ఆయన చెప్పినట్లుగానే టీడీపీ, జనసేన, బీజేపీకి అన్నే సీట్లు వచ్చాయి. ఎవరూ ఊహించని స్ధాయిలో కూటమి ఏకంగా 160 సీట్లకు పైగా సాధిస్తుందని కేకే సర్వే మాత్రమే అంచనా వేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే జరిగింది.

దీంతో కేకే ఎగ్జిట్ పోల్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. అంకెలతో సహా ఇంత కరెక్ట్ గా చెప్పింది ఎవరూ లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏపీలో ఈసారి టీడీపీ కూటమి గెలుస్తుంది అని కొన్ని సర్వేలు తమ ఎగ్జిట్ పోల్స్ లో చెప్పినప్పటికీ.. ఇన్ని సీట్లతో కూటమి సునామీ సృష్టించబోతోందని చెప్పింది మాత్రం కేవలం కేకే సర్వే. జాతీయ, స్థానిక సర్వేలకు భిన్నంగా సర్వే చేసిన కేకే.. ప్రస్తుతం అందరి దృష్టిని అట్రాక్ట్ చేస్తున్నాడు. కూటమి సునామీని ముందే ఊహించిన ఒకే ఒక్కడిగా కేకే పేరు మార్మోగిపోతోంది.

కేకే సర్వే అక్షరాల నిజం కావడంతో ఇప్పుడు అందరి చూపు ఆయనపైనే ఉంది. కేకేను పీకేతో(ప్రశాంత్ కిశోర్) పోలుస్తున్నారు కొందరు. దేశంలో పీకే (ప్రశాంత్ కిశోర్) లానే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కేకే తయారయ్యారని కితాబిస్తున్నారు. కాగా, గత ఎన్నికల్లో వైసీపీకి 151 సీట్లు వస్తాయని కేకే ముందే చెప్పడం విశేషం. ఈసారి కూటమి సునామీని ముందే ఊహించిన ఏకైక వ్యక్తి కేకే.

తన సర్వేలో కేకే చెప్పింది ఇదే..
అధికార వైసీపీ 175 స్థానాల్లో పోటీ చేయగా… కేవలం 14 స్థానాలకు పరిమితం అవుతుందని కేకే ముందే చెప్పారు.
టీడీపీ పోటీ చేసిన 144 నియోజకవర్గాల్లో.. 133 స్థానాల్లో విజయం సాధిస్తుందని చెప్పారు.
ఎవరి సపోర్ట్ అవసరం లేకుండా టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు చంద్రబాబుకు 133 స్థానాలకు తగ్గకుండా సీట్లు వస్తాయని అంచనా వేశారు.
ఇక జనసేన గురించి సంచలన విషయం చెప్పారాయన. జనసేన పోటీ చేసిన 21 స్థానాల్లోనూ గెలుస్తుందని కేకే కాన్ఫిడెంట్ గా వెల్లడించారు.
ఇక బీజేపీ పోటీ చేసిన 10 అసెంబ్లీ స్థానాల్లో ఏడు స్థానాలను కైవసం చేసుకుంటుందన్నారు కేకే.

Also Read : జనసేన జయకేతనం.. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో గ్లాసు ప్రభంజనం