శభాష్ పోలీసులు.. ఏపీలో తప్పిపోయిన బాలికను ఈ ట్రిక్ వాడి కేవలం గంటలోపే గుర్తించిన కాప్స్
బాలికను గుర్తించి నాయనమ్మకు గంటలో అప్పగించారు.

పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో తప్పిపోయిన బాలిక (7)ను డ్రోన్ కెమెరాతో గంట వ్యవధిలో గుర్తించారు వన్ టౌన్ పోలీసులు. చిన్నగొల్లపాలెం నుంచి భీమవరానికి నాయనమ్మ బొర్రా నారాయణమ్మతో కలిసి ఆధార్ అప్ డేట్ కోసం బాలిక వెళ్లింది.
అక్కడ బాలిక అదృశ్యమైంది. ఆమె తప్పిపోవడంతో బొర్రా నారాయణమ్మ పోలీసులను ఆశ్రయించింది. వెంటనే స్పందించిన పోలీసులు డ్రోన్ కెమెరాతో జల్లెడ పట్టారు. బాలికను గుర్తించి నాయనమ్మకు గంటలో అప్పగించారు. పోలీసులకు నారాయణమ్మ కృతజ్ఞతలు తెలిపారు.
Also Read: రూ.20 వేలలోపే.. అద్భుతమైన ఫీచర్లతో శాంసంగ్ స్మార్ట్‌ఫోన్లు.. ఇప్పుడే కొనేయండి..
ప్రస్తుతం డ్రోన్లను అనేక రంగాల్లో వాడుతున్నారు. పోలీసులు, ఆర్మీకి అవి చాలా ఉపయోగకరంగా మారాయి. సైనికులు శత్రువుల సమాచారం కోసం కూడా వాడుతున్నారు. భద్రతా పరిశీలన కోసం సరిహద్దుల్లో మానిటరింగ్ కోసం వాటిని ఉపయోగిస్తున్నారు. అగ్ని ప్రమాదాల్లో బాధితులను గుర్తించడం కోసం కూడా డ్రోన్లను వాడుతున్నారు.
ఇక పోలీస్ విభాగం మానిటరింగ్, నేరగాళ్ల కదలికలను గుర్తించడం కోసం డ్రోన్లను వాడుతోంది. రైతులు కూడా డ్రోన్లను వాడుతూ పంటల మీద పురుగుమందులు, ఎరువులను చల్లుతున్నారు. సినిమా, టీవీ షూటింగులు, వివాహ వేడుకల్లో డ్రోన్లను ఏ మేరకు వాడుతున్నారో ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు.