Best Samsung phones: రూ.20 వేలలోపే.. అద్భుతమైన ఫీచర్లతో శాంసంగ్ స్మార్ట్‌ఫోన్లు.. ఇప్పుడే కొనేయండి..
కేవలం రూ.10,000లోపు బడ్జెట్‌లోనే దొరుకుతున్న మొట్టమొదటి 5G ఫోన్ ఇది.

భారత్‌లో చాలా మంది స్మార్ట్‌ఫోన్ యూజర్లకు శాంసంగ్ బ్రాండ్ అంటే చాలా ఇష్టం. శాంసంగ్ స్మార్ట్‌ఫోన్లను అధికంగా వాడుతుంటారు. వాటిలోని ఫీచర్లు, ధర చాలా మందిని ఆకర్షిస్తోంది. రూ.20,000 కంటే తక్కువ ధరలో స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్న వారి కోసం శాంసంగ్‌లో పలు మోడళ్లు అందుబాటులో ఉన్నాయి. వాటి కొన్నింటిని చూద్దాం..
గెలాక్సీ F06
శాంసంగ్ గత నెల గెలాక్సీ F06ను రిలీజ్ చేసింది. కేవలం రూ.10,000లోపు బడ్జెట్‌లోనే దొరుకుతున్న మొట్టమొదటి 5G ఫోన్ ఇది. ఆండ్రాయిడ్ 15, వన్ UI 7 తో పనిచేస్తుంది. డైమెన్సిటీ 6300 చిప్‌సెట్ తో విడుదలైంది. HD+ రిజల్యూషన్‌తో 6.7-అంగుళాల ఎస్‌సీడీ స్క్రీన్‌తో వచ్చింది.
గెలాక్సీ ఎం 16
డైమెన్సిటీ 6300 చిప్‌సెట్, FullHD+ రిజల్యూషన్, 90Hz రిఫ్రెష్ రేట్‌తో ఈ స్మార్ట్‌ఫోన్ వచ్చింది. 6.7-అంగుళాల sAMOLED స్క్రీన్ తో మార్కెట్లో ఉంది. మైక్రో ఎస్‌డీ కార్డ్ స్లాట్‌తో అందుబాటులో ఉన్న స్మార్ట్‌ఫోన్ ఇది. ఆరేళ్ల పాటు ఓఎస్ అప్‌డేట్లను అందుకోవచ్చు. దీని ప్రారంభ ధర ధర రూ.15,499గా ఉంది.
గెలాక్సీ ఎం35
బ్యాటరీ సామర్థ్యం అధికంగా ఉండి, మంచి డిస్‌ప్లేతో ఉండే గెలాక్సీ ఫోన్ ఇది. 6,000mAh బ్యాటరీ సామర్థ్యంతో, Exynos 1380 చిప్‌సెట్‌తో ఇది మార్కెట్లోకి వచ్చింది. ఆండ్రాయిడ్ 14తో One UI 6.1తో పనిచేస్తుంది. నాలుగేళ్ల పాటు OS అప్‌డేట్లను అందిస్తుంది. 6.6 అంగుళాల 120Hz sAMOLED స్క్రీన్ తో ఇది వచ్చింది. గెలాక్సీ ఎం35 ప్రారంభ ధర రూ.14,547.
గెలాక్సీ ఎఫ్55
ఫాక్స్ లెదర్ బ్యాక్ ప్యానెల్‌తో వచ్చిన తేలికైన శాంసంగ్ డివైజ్ ఇది. రూ. 20,000 కంటే తక్కువ ధరకు లభ్యమవుతోంది. ఈ మిడ్ రేంజ్ ఫోన్ స్నాప్ డ్రాగన్ 7 Gen 1 చిప్‌సెట్‌తో, FullHD+ రిజల్యూషన్‌తో 6.7-అంగుళాల 120Hz sAMOLED స్క్రీన్‌తో మార్కెట్లో ఉంది. 8ఎంపీ అల్ట్రావైడ్ సెన్సార్‌తో పాటు 50ఎంపీ మెయిన్ షూటర్, 2ఎంపీ మాక్రో షూటర్‌తో ఇది ట్రిపుల్ కెమెరా సెటప్‌తో ఉంది. 50ఎంపీ సెల్ఫీ కెమెరా ఇందులో ఉంది. దీన్ని 5,000mAh బ్యాటరీ సామర్థ్యంతో తీసుకొచ్చారు.