ఘాతుకం : 75 ఏళ్ల ఓ వృద్దురాలిపై గ్యాంగ్ రేప్..మతిస్థిమితం కోల్పోయిన ముసలిప్రాణం

75 ఏళ్ల ఓ వృద్దురాలిపై గ్యాంగ్ రేప్ : మతిస్థిమితం కోల్పోయిన ముసలిప్రాణం
75 ఏళ్ల వృద్ధురాలిని చూస్తే ఎవరికైనా సహాయం చేయాలనిపిస్తుంది.కానీ కేరళలో మనిషి రూపంలో ఉండే రాక్షసులు మాత్రం కన్నూమిన్నూ తెలియని కామాంధులుగా మారారు. వృద్ధురాలిపై సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు. దారుణంగా కొట్టారు. దీంతో ఆ ముసలి ప్రాణం విలవిల్లాడిపోయింది. ఈ దారుణ ఘటన కేరళలోని కొచ్చిలో చోటు చేసుకుంది.
కొచ్చి ఎర్నాకుళంలోని కోలెన్‌చేరీ సమీపంలోని గ్రామంలో 75 ఏళ్ల ఓ వృద్దురాలు ఆదివారం (ఆగస్టు2,2020) మధ్యాహ్నం తమలపాకులు కావాలని స్థానికంగా ఉండే యువకులను అడిగింది. దీంతో వాళ్లు ఆమెకు తమలపాకులు ఇప్పిస్తామని మాతో రమ్మని తీసుకెళ్లారు. అలా ఒక ఇంటికి తీసుకెళ్లారు. అక్కడ పశువుల్లా ఆమె మీద పడి గ్యాంగ్ రేప్ చేసి, తీవ్రంగా కొట్టారు. దీంతో వయస్సు ఉడిగిపోయిన ఆ ముసలి ప్రాణం విలవిలలాడిపోయింది.
ఆమె కేకలు, అరుపులు విన్న స్థానికులు ఘటనా స్థలానికి చేరుకుని చూడగా.. తీవ్ర రక్తస్రావంతో పడి ఉంది. జరిగిన దారుణాన్ని ఊహించినవారికి ఆగ్రహం పెల్లుబికింది. కానీ వృద్ధురాలిని పరిస్థితి దారుణంగా ఉండటంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి అత్యంత దారుణంగా ఉండటంతో కోలెన్చేరిలోని ప్రైవేట్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ కు తరలించారు.
ఆమెను పరీక్షించిన డాక్టర్లు ఆవేదన చెందారు. దారుణంగా అత్యాచారానికి గురైందనీ ఈ దారుణ దుశ్చర్యకు ఆమె శరీరంలోని ప్రైవేట్ భాగాలు బాగా దెబ్బతిన్నాయని తెలిపారు. ఈ ఘటనతో ఆమె మతి స్థిమితం కోల్పోయిందని చెప్పారు. తీవ్ర రక్తస్రావంతో ఉన్న ఆమెకు వెంటనే ఆపరేషన్ చేయాలని చెప్పారు.
ఈ ఘటనపై కేరళ రాష్ట్ర మహిళా కమిషన్ తీవ్రంగా మండిపడింది. మహిళా కమిషన్ చైర్‌పర్సన్ ఎంసి జోసెఫిన్ మాట్లాడుతూ..వృద్ధురాలికి కూడా సమజంలో భద్రత లేకపోవటం ఆందోళన కలిగిస్తోందని అన్నారు. దీంట్లో భాగంగా మహిళా కమిషన్ మంగళవారం దీనికి సంబంధంచిన ఆధారాలు సేకరించింది. ఈ దారుణానికి పాల్పడిన దుర్మార్గులను వెంటనే శిక్షించాలని పోలీసు డిపార్ట్ మెంట్ ను కోరారు.
ఈ దారుణ ఘటనపై పుథెన్‌క్రూజ్ పోలీసు ఇన్‌స్పెక్టర్ సజన్ జేవియర్ మహిళా కమిషన్ సేకరించిన ఆధారాల ప్రకారం కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు.
బాధితురాలి పొరుగన ఉండే డ్రైవర్ అతని స్నేహితుడు మరొకరు కలిసి కొలెన్చేరి సమీపంలోని పాంగోడ్ వద్ద ఉన్న ఓ ఇంటికి తీసుకెళ్లి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని విచారణలో తేలింది. అంతేకాదు ఆమెపై అత్యాచారం చేసిన తరువాత పదునైన కత్తితో ఆమె ప్రైవేటు భాగాలను..శరీరంలో పలు చోట్ల దారుణంగా పొడిచారని తేలింది.