Konaseema: ఈ కోడలు గోల్డ్ యహే.. అత్త పుట్టినరోజుకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన కోడలు..

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలులో అత్తకు కోడలు ఇచ్చిన బహుమతులు చూస్తే ఎవరైనా ఆశ్చర్య పోవాల్సిందే.

Konaseema: ఈ కోడలు గోల్డ్ యహే.. అత్త పుట్టినరోజుకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన కోడలు..

Daughter in Law Gifts for Aunt

Updated On : March 6, 2025 / 1:00 PM IST

Daughter in Law Gifts for Aunt: అత్తాకోడళ్లంటే మనకు ముందుగా గుర్తుకొచ్చేది ఎప్పుడూ గొడవులుపడుతూ ఉంటారని. కట్నం కోసం కోడల్ని అత్త వేధిస్తుందని, అత్తను సరిగా చూసుకోకుండా కోడలు ఇబ్బంది పెడుతుందని.. ఇలా.. సోషల్ మీడియాలో వార్తలు ఎక్కువగానే కనిపిస్తుంటాయి. అయితే, ప్రస్తుతం కాలం మారుతుంది. టెక్నాలజీ పెరుగుతోంది. మహిళలు అన్నిరంగాల్లో రాణిస్తున్నారు. అత్తాకోడళ్లు అంటే చాలా ఇళ్లలో తల్లిబిడ్డల్లానే కలిసిపోతున్న పరిస్థితి. తాజాగా అత్త పుట్టినరోజుకు కోడలు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చి తన అభిమానాన్ని చాటుకుంది. ఇందుకు సంబంధించిన వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Also Read: Genetic Diseases : మేనరికపు పెళ్లిళ్లు చేసుకోవచ్చా? పుట్టబోయే పిల్లలకు జన్యు వ్యాధులు వస్తాయా? కొత్త అధ్యయనంలో తేలింది ఇదిగో..!

ఇంట్లో ఎవరి పుట్టినరోజు జరిగినా కుటుంబ సభ్యులు సాధారణంగా ఏదో ఒక బహుమతి ఇస్తుండటం చూస్తుంటాం. అయితే, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలులో అత్తకు కోడలు ఇచ్చిన బహుమతులు చూస్తే ఎవరైనా ఆశ్చర్య పోవాల్సిందే. ఒక లక్ష రెండు లక్షలు కాదు.. ఏకంగా కోటి రూపాయల విలువైన బహుమతిని తన అత్తకు కోడలు కానకనుగా ఇచ్చింది.

Also Read: Gold: బంగారంపై పెట్టుబడి పెడితే కాసుల వర్షం కురిపిస్తుందా.. సెంట్రల్ బ్యాంక్‌లు ఏం చేస్తున్నాయో తెలుసా..

కోనసీమ జిల్లా రాజోలుకు చెందిన రాజోలు చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అర్యవైశ్య సంఘం కార్యదర్శి కాసు శ్రీనివాస్, భవానీ దంపతుల కుమారుడు సుఖేశ్ కు రెండేళ్ల క్రితం పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన శ్రీరంగనాయకితో వివాహం జరిగింది. అత్తామామలు తనను కన్న తల్లిదండ్రుల్లా చూసుకుంటున్నారన్న అభిమానంతో.. అత్త భవానీ 50వ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వ హించాలని కోడలు నిర్ణయించుకుంది. పుట్టినరోజు వేడుకల్లో అత్తకు పట్టుచీర, పసుపుకుంకుమ, గాజులు, మంగళసూత్రంతోపాటు వంద గ్రాముల బంగారు బిస్కెట్, రూ.28 లక్షల విలువ చేసే డైమండ్ నెక్లెస్, 50లక్షల 50రూపాయల 50 పైసల నగదు కలిపి మొత్తం రూ.కోటి విలువ చేసే బహుమతులను అందించి తమ అభిమానాన్ని చాటుకుంది.