Krishna Board : ఏపీ – తెలంగాణ వాదనలు..పూర్తి వివరాలు

  • Published By: madhu ,Published On : June 5, 2020 / 12:25 AM IST
Krishna Board : ఏపీ – తెలంగాణ వాదనలు..పూర్తి వివరాలు

Updated On : June 5, 2020 / 12:25 AM IST

కృష్ణానదీ నీటి యాజమాన్య బోర్డు సమావేశం 2020, జూన్ 04వ తేదీ గురువారం హాట్ హాట్ గా సాగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇరు రాష్ట్రాలు ఒకరిపై ఒకరు ఫిర్యాదులు, కౌంటర్లతో రసవత్తరంగా నడిచింది. రెండు రాష్ట్రాల నీటి పారుదల శాఖ ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులు తమ తమ రాష్ట్రాల వాదనలు వినిపించారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను తీసుకుంది కృష్ణా బోర్డు. 

తెలంగాణ ప్రాజెక్టలన్నీ పాతవే : –
ఈ మీటింగ్ దాదాపు 6 గంటల పాటు సాగింది. బోర్డు చైర్మన్ పరమేశం అధ్యక్షతన 12వ సమావేశం జరిగింది. తెలంగాణలో చేపడుతున్న ప్రాజెక్టులన్నీ పాతవే అని అన్ని ఆధారాలతో ప్రిన్సిపల్ సెక్రటరీ రజత్ కుమార్ వివరించారు. ఈ మేరకు ఒక ప్రెజెంటేషన్ కూడా ఇచ్చారు. మరోవైపు ఏపీ కూడా తమ వాటా ప్రకారమే నీటిని వినియోగించుకుంటామని తన వాదనను సమర్థించుకునే ప్రయత్నాలు చేసింది.

తెలంగాణ ప్రాజెక్టలన్నీ పాతవే : –
ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న ప్రాజెక్టుల పంచాయితీ విషయంలో బోర్డు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రెండు రాష్ట్రాలు కృష్ణా నది పై నిర్మించే అన్ని ప్రాజెక్టుల DPR ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే DPRలను ఎప్పటిలోగా ఇవ్వాలనే విషయంలో మాత్రం ఎలాంటి కండీషన్లు పెట్టలేదు. అలాగే నీటి వినియోగం విషయంలో ఈ ఏడాది కూడా 66-34 నిష్పత్తి లో గత ఏడాది తీసుకున్నట్లుగానే తీసుకోవాలని ఇరు రాష్ట్రాలు అంగీకరించాయి. ఉమ్మడి రాష్ట్రాల పరిధిలోకి వచ్చే శ్రీశైలం ప్రాజెక్టు జల విద్యుత్ విషయంలో ఈసారి రెండు రాష్ట్రాలు కూడా 50-50 రేషియోలో తీసుకునేందుకు అంగీకరించాయి.

మిగులు జలాల వాడకంపై కమిటీ : –
ఇక వరద వచ్చే సమయంలో మిగులు జలాల పై రేషియో ప్రకారం 50-50 ప్రకారం అపెక్స్ కమిటీకి పంపాలని బోర్డు సమావేశంలో నిర్ణయించారు. మరోవైపు శ్రీశైలం, నాగార్జునసాగర్ విషయంలో గతంలో నీళ్ల పంపకాలకు సంబంధించి పూర్తి స్థాయిలో వినియోగించుకోలేదనే విషయాన్ని తెలంగాణ లేవనెత్తింది. వచ్చే ఏడాదిని ఆ లోటును భర్తీ చేసుకుంటామని కోరిన తెలంగాణ నిర్ణయం పట్ల .. బోర్డు ఎలాంటి స్పష్టతను ఇవ్వలేదు. అలాగే మిగుల జలాల వాడకం పై కమిటీ వేసినట్లు చైర్మన్ పరమేశం తెలిపారు. ఆ కమిటీ రిపోర్ట్ వచ్చాక మిగులు జలాల పై నిర్ణయం తీసుకుంటామన్నారు.

కేంద్ర జలశక్తికి అంశాలు : –
మొత్తం మీద సుదీర్ఘంగా సాగిన బోర్డు సమావేశంలో ఇరు రాష్ట్రాలు లేవనెత్తిన అంశాలను కేంద్ర జలశక్తి శాఖకు పంపాలని చైర్మన్ పరమేశం నిర్ణయించారు. అలాగే పట్టిసీమ వల్ల 45 టీఎంసీలో ఇరు రాష్ట్రాలకు ఎంత మేరకు రావాలనే అంశంపై కూడా కేంద్రం ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకోవాలని బోర్డు నిర్ణయించింది. విభజన చట్టం ప్రకారం కృష్ణా బోర్డు తరలింపు అంశంపై కూడా చర్చ జరిగింది. చట్టం ప్రకారం షిప్ట్ చేస్తామని ఏపీ ప్రభుత్వం ఎక్కడ పెట్టమంటే అక్కడికి షిఫ్ట్ చేయాలని నిర్ణయించింది.

Read: గోదావరి నది యాజమాన్య బోర్డు సమావేశం..వివాదం పరిష్కారమయ్యేనా