Kuppam : కుప్పం మున్సిపల్ సమరం.. నేడు బహిరంగ సభలో లోకేష్ ప్రసంగం

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో టీడీపీ జనరల్ సెక్రటరీ నారా లోకేష్ కుప్పంలో పర్యటించనున్నారు. శుక్రవారం బండశెట్టిపల్లిలో ఏర్పాటు బహిరంగ సభలో లోకేష్ ప్రసంగించనున్నారు.

Kuppam : కుప్పం మున్సిపల్ సమరం.. నేడు బహిరంగ సభలో లోకేష్ ప్రసంగం

Kuppam

Updated On : November 12, 2021 / 8:54 AM IST

Kuppam :  మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో టీడీపీ జనరల్ సెక్రటరీ నారా లోకేష్ కుప్పంలో పర్యటించనున్నారు. శుక్రవారం.. రెండవ రోజు సామగుట్టవల్లి, లక్ష్మీపురం, బాబునగర్, బీసికాలనీ, విజయలక్ష్మి రోడ్డు, తంబిగానిపల్లి, అనిమిగానిపల్లి, వడ్డిపల్లి, సంపంగినగర్, డి.కె.పల్లి, మోడల్ కాలనీ, రాములవారి గుడి మీదుగా కొనసాగనుంది. ఉదయం 9 గంటల నుంచి రాత్రి పది గంటల వరకు లోకేష్ ప్రచారం కొనసాగుతుంది. ఇక మద్యంలో బండశెట్టిపల్లిలో బహిరంగసభ ఏర్పాటు చేశారు టీడీపీ శ్రేణులు.. ఈ సభలో లోకేష్ ప్రసంగించనున్నారు. ఇక కుప్పం మున్సిపల్ ఎన్నిక నవంబర్ 15తేదీ జరగనున్నాయి.

చదవండి : Kuppam Municipal Election: అధికార, ప్రతిపక్షాల ఎత్తుగడలు.. హీట్ పెంచేస్తున్న కుప్పం!

కుప్పం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి సొంత నియోజకవర్గం కావడంతో ఇక్కడ అధికార ప్రతిపక్ష పార్టీలు ప్రచారం హోరాహోరీగా చేస్తున్నారు. రాష్ట్రంలోని టీడీపీ కీలక నేతలు కుప్పంలో తిష్టవేశారు. ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు.. వైసీపీ నేతలు కూడా ప్రచారం జోరుగా చేస్తున్నారు. చంద్రబాబు సొంతగడ్డని వైసీపీ వశం చేసుకోవాలని ఉర్రుతలూగుతుంది. మంత్రి పెద్దిరెడ్డితోపాటు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు కుప్పంలో తిష్టవేసి ప్రచారం చేస్తున్నారు. రాష్ట్రం మొత్తం ఓ లెక్క.. కుప్పం ఓ లెక్క అన్నట్లుగా ప్రచారం సాగుతుంది.

చదవండి : Kuppam Municipal Election: అధికార, ప్రతిపక్షాల ఎత్తుగడలు.. హీట్ పెంచేస్తున్న కుప్పం!