Kuppam : ముగిసిన కుప్పం మున్సిపోల్…80 శాతం పోలింగ్ ?
ఫుల్ టెన్షన్ నడుమ కుప్పం మున్సిపోల్ ముగిసింది. సుమారు 80 శాతం మేర పోలింగ్ నమోదయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు.

Kuppam
Kuppam Polling : ఫుల్ టెన్షన్ నడుమ కుప్పం మున్సిపోల్ ముగిసింది. సుమారు 80 శాతం మేర పోలింగ్ నమోదయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. 2021, నవంబర్ 15వ తేదీ సోమవారం ఉదయం ప్రారంభమైనప్పటి నుంచి పోలింగ్ ముగిసేదాక ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దొంగ ఓట్ల కలకలకంతో అడుగడుగునా…ఉద్రిక్తంగా పోలింగ్ సాగింది. గొడవలకు 16వ వార్డు కేరాఫ్ అడ్రస్ గా నిలిచింది. మరో రెండు వార్డుల్లో స్వల్ప ఘటనలు చోటు చేసుకున్నాయి. 16వ వార్డులో ఉదయం నుంచి గొడవలు జరిగాయి.
Read More : CM YS Jagan Review On Roads : రాష్ట్రంలో అన్నిరోడ్లు మరమ్మత్తులు చేయండి-సీఎం జగన్
పోలింగ్ కేంద్రం వద్దకు వైసీపీ, టీడీపీ పార్టీలకు చెందిన ముఖ్యనేతలు, కార్యకర్తలు మోహరించడంతో ఫుల్ టెన్షన్ వాతావరణం నెలకొంది. బయటి ప్రాంతం నుంచి 16వ వార్డుకు దొంగ ఓటర్లు వచ్చాయని టీడీపీ నేతలు ఆరోపణలు గుప్పించడమే కాకుండా..వారిని పట్టుకున్నారు. దొంగ ఓటర్లతో ఏకంగా మూడు బస్సులను పట్టుకోవడం కలకలం రేపింది. ఘర్షణలు చోటు చేసుకోవడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి లాఠీఛార్జీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
Read More : Fake Reporter Arrested : పోలీసులు,విలేకరులమని బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్న ఇద్దరి అరెస్ట్
ఎలాంటి పరిస్థితి నెలకొందో..ఎప్పటికప్పుడు ఆరా తీశారు టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు స్థానిక నేతలతో గంటగంటలకు ఆయన ఫోన్లో మాట్లాడారు. ఓ దశంలో కుప్పం రావాలని బాబు భావించారు. కుప్పంలో దొంగ ఓట్ల కలకలంపై జిల్లా వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు ఆందోళనలు చేపట్టారు. చిత్తూరు ఎస్పీ కార్యాలయం వద్ద తెలుగు తమ్ముళ్లు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా ఆందోళన చేస్తున్న టీడీపీ నేతలను అరెస్టు చేశారు.
Read More : T20 World Cup 2021: ఐసీసీ టీమ్‌లో కెప్టెన్‌గా బాబర్ అజామ్.. చోటు దక్కించుకోలేకపోయిన ఇండియన్ ప్లేయర్లు
కుప్పం మున్సిపాలిటీలో మొత్తం 24 వార్డుల కోసం పోలింగ్ జరిగింది. 600 మంది పోలీసులను మోహరింపజేశారు. మొత్తం 48 పోలింగ్ సెంటర్లను ఏర్పాటు చేయగా.. 57 వేల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 230 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. రాష్ట్రంలోని నెల్లూరు కార్పొరేషన్‌తో పాటు కుప్పం, బుచ్చిరెడ్డిపాలెం, ఆకివీడు, జగ్గయ్యపేట, కొండపల్లి, గురజాల, దాచేపల్లి, దర్శి, బేతంచెర్ల, కమలాపురం, రాజంపేట, పెనుకొండ మున్సిపాలిటీలకు పోలింగ్ జరిగింది. వీటితో పాటు రాష్ట్రంలోని మరో 7 కార్పొరేషన్లలో 12 డివిజన్లకు ఎన్నిక నిర్వహించారు. 17న ఫలితాలు వెల్లడిస్తారు.