స్కానింగ్ సౌకర్యం లేదని కరోనా బాధితుడిని బయటికి పంపిన సిబ్బంది…కోవిడ్ ఆస్పత్రిలో దారుణం

  • Published By: bheemraj ,Published On : July 17, 2020 / 07:48 PM IST
స్కానింగ్ సౌకర్యం లేదని కరోనా బాధితుడిని బయటికి పంపిన సిబ్బంది…కోవిడ్ ఆస్పత్రిలో దారుణం

Updated On : July 17, 2020 / 8:18 PM IST

వైద్యుల నిర్లక్ష్యంతో ఓ కరోనా రోగి ఆస్పత్రి బయటికి రావాల్సివచ్చింది. స్టేట్ కోవిడ్ ఆస్పత్రిగా పేరున్న కర్నూలు ఆస్పత్రిలో పేషెంట్ ను అక్కడి సిబ్బంది బయటికి పంపించారు. స్కానింగ్ చేయించుకురావాలని చెప్పడంతో రోగి బంధువులు స్ట్రెచర్ పై పేషెంట్ ను తీసుకెళ్లారు. విషయం తెలిసిన స్థానికులు ఆందోళనకు దిగారు. దీంతో తమ ఆస్పత్రిలో అన్ని సౌకర్యాలు ఉన్నాయని అధికారులు క్లారిటీ ఇచ్చారు. అన్ని సదుపాయాలుంటే పేషెంట్ ను ఎందుకు బయటికి పంపారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. వైద్య సిబ్బంది నిర్లక్ష్యంపై బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

కర్నూలులోని రాష్ట్ర కోవిడ్ ఆస్పత్రిలో ఓ రోగికి స్కానింగ్ చేసే విషయంలో వార్డు బాయ్ లేకుండా కుటుంబ సభ్యులే స్ట్రేచర్ పై రోడ్డుపై తీసుకెళ్లారు. ఎమర్జెన్సీకి సంబంధించి పేషెంట్లను స్కానింగ్, ఎక్స్ రేల కోసం వార్డు కచ్చితంగా వార్డు బాయ్ తీసుకెళ్లాలి. అధికార యంత్రాంగం అలసత్వమే పూర్తి కారణమని తెలుస్తోంది. కుటుంబ సభ్యులు 50 సంవత్సరాల వ్యక్తిని రోడ్డుపై తీసుకొచ్చిన పరిస్థితి ఉంది. ఏడు జిల్లాలకు చెందిన పేషెంట్లు ఇక్కడికి వచ్చి చికిత్స చేయించుకుంటారు.

కోవిడ్ శాతం ఎక్కువ పెరుగుతోంది. ఇప్పటికే ఐదు వేలపైగా కేసులు నమోదు అవుతున్నాయి. అలాంటి పరిస్థితుల్లో అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన వైద్య ఆరోగ్య శాఖ పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించడమే దీనికి కారణమని తెలుస్తోంది. స్ట్రెచర్ పై 50 సంవత్సరాలకు వయస్సున్న వ్యక్తిని రోడ్డుపై, పబ్లిక్ లో తీసుకరావడంపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కర్నూలు ఆస్పత్రిని రాష్ట్ర కోవిడ్ ఆస్పత్రిగా చేసినప్పటికీ ఇక్కడున్న అధికార యంత్రాంగం పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని అంటున్నారు. కొన్ని ఘటనలు తెలిసి జరుగుతున్నప్పటికీ తెలియని ఘటనలు అనేకం జరుగుతున్నాయని తెలుస్తోంది. అధికార యంత్రాంగం అలసత్వమే ఇలాంటి ఘటనలకు కారణమని అంటున్నారు. వార్డు బాయ్ లేకుండా తీసుకెళ్లడం సరికాదని కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అన్నిసౌకర్యాలున్నాయని చెబుతున్నప్పటికీ ఎక్స్ రేకు సంబంధించి బయటికి పంపించాల్సిన పరిస్థితేంటి?
ఆస్పత్రిలోనే ఎక్స్ రే సెంటర్లు ఉంటాయి..వార్డు బాయ్ ని వెంట పంపాలి. కానీ వార్డ్ బాయ్ ను పెట్టలేదు. లేక వార్డ్ బాయ్ విధుల్లో ఉన్నారా? ఉన్నా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారా? అనేది అధికార యంత్రాంగం చెప్పాలి.