ఆ అసెంబ్లీ స్థానం నుంచే మళ్లీ పోటీ చేస్తా: వైసీపీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్
Hafeez Khan: నన్ను ఎంపీగా పోతావా? అని ఎవరూ అడగలేదు. కర్నూలును ఎంతో అభివృద్ధి చేశా..

Kurnool MLA Hafeez Khan
కర్నూలు అసెంబ్లీ నుంచే మళ్లీ పోటీ చేస్తానని స్థానిక ఎమ్మెల్యే, వైసీపీ నేత హఫీజ్ ఖాన్ అన్నారు. మరోసారి ఎమ్మెల్యే అవుతానని ధీమా వ్యక్తం చేశారు. కర్నూలులో 10టీవీతో హఫీజ్ ఖాన్ మాట్లాడారు. రాజకీయ కుట్రలో భాగంగానే తనపై కొందరు ఆరోపణలు చేస్తున్నారన్నారు.
‘నంద్యాల ఎంపీ అనేది ఊహాగానాలే… ముఖ్యమంత్రి వైఎస్ జగన్, కర్నూలు ప్రజల ఆశీర్వాదం ఉంటే మరోసారి ఎమ్మెల్యే అవుతా. కర్నూలు టికెట్ పైన ఎలాంటి చర్చ జరగలేదు. నన్ను ఎంపీగా పోతావా? అని ఎవరూ అడగలేదు. కర్నూలును ఎంతో అభివృద్ధి చేశా.. అందుకే కర్నూలు నుంచే ఎమ్మెల్యేగా పోటీలో ఉంటా.
పార్టీలో టికెట్ ఎవరైనా ఆశించవచ్చు. టికెట్ విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకుంటారు. రాజకీయ కుట్రలో భాగంగానే నా ప్రత్యర్థులు అనేక ఆరోపణలు చేస్తున్నారు’ అని హఫీజ్ ఖాన్ అన్నారు.
కర్నూలు వైసీపీ అసెంబ్లీ టికెట్ విషయంలో ఆ పార్టీలో వర్గ విభేదాలు తారస్థాయికి చేరడం ఉత్కంఠ రేపుతోంది. మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి, హఫీజ్ ఖాన్ మధ్య వర్గపోరు నడుస్తోంది. ఇటీవల ఎస్వీ మోహన్ రెడ్డి ప్రధాన అనుచరులు ప్రత్యేకంగా సమావేశం కావడం కాక రేపింది.
AP Politics: 3 గంటల పాటు వీటిపై చర్చించిన చంద్రబాబు, పవన్ కల్యాణ్.. ఆ తర్వాత..