MLA Hafeez Khan: లోకేశ్.. నీ టెంటు దగ్గరకొస్తా.. నాపై ఆరోపణలు రుజువు చేశాకే కర్నూలు దాటాలి ..
పాదయాత్రలో ఎక్కడ కలవాలో చెప్పి నారా లోకేష్ మర్యాద కాపాడుకోవాలి. అలా కాకపోతే ఈరోజు సాయంత్రంలోపల ఎక్కడో ఒకచోట నేను పాదయాత్రలోకి వస్తా అని కర్నూల్ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ అన్నారు.

Kurnool MLA Hafeez Khan
MLA Hafeez Khan: నారా లోకేశ్ (Nara Lokesh) .. నాపై చేసిన ఆరోపణలు రుజువు చేయాలి, అప్పుడే కర్నూలు (Kurnool) దాటి వెళ్లాలని కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ (Kurnool MLA Hafeez Khan) డిమాండ్ చేశారు. 10టీవీతో మాట్లాడుతూ.. నారా లోకేశ్ తనపై చేసిన ఆరోపణలపై చర్చకు సిద్ధంగా ఉన్నానని అన్నారు. నీవు ఉన్న టెంటు దగ్గరకు వస్తా అక్కడే చర్చిద్దాం. నాపై ఆరోపణలు రుజువు చేయకపోతే నారా లోకేశ్ క్షమాపణ చెప్పాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. నాపై చేసిన ఆరోపణలపై నేను దేనికైనా సిద్ధమే. ఖురాన్ పట్టుకొని ఏ మసీదు దగ్గరుకైనా, దర్గాకైనా వస్తా. మీరు రమ్మంటే గౌరవంగా వస్తా. లేదంటే ఏదో సమయంలో వస్తా.. మీతో డిస్కస్ చేస్తానని హఫీజ్ ఖాన్ అన్నారు.
Nara Lokesh : ఆయన చంద్రబాబుని పొగిడితే మీకెందుకు అంత మంట?- వైసీపీ నాయకులపై లోకేశ్ ఫైర్
పాదయాత్రలో ఎక్కడ కలవాలో చెప్పి లోకేష్ మర్యాద కాపాడుకోవాలి. అలా కాకపోతే ఈరోజు సాయంత్రంలోపల ఎక్కడో ఒకచోట నేను పాదయాత్రలోకి వస్తానని కర్నూల్ ఎమ్మెల్యే చెప్పారు. నీ పాదయాత్ర దగ్గరకు వచ్చే సమయంలో నా అనుచర గణం కానీ, పార్టీ కార్యకర్తలుగానీ ఎవరు రారు. కేవలం నేను ఒక్కడినే వస్తాను. నాపై చేసిన ఆరోపణలు ఆధారాలతో నిరూపించాలని అన్నారు. నీతిగా, నిజాయితీగా రాజకీయాలు చేసేందుకు, ప్రజలకు పనిచేసేందుకు అమెరికాలోని లగ్జరీ లైఫ్ వదులుకొని వచ్చిన వ్యక్తిని నేను. అలాంటినాపై ఇష్టమొచ్చినట్లు ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోను అంటూ హెచ్చరించారు.
Nara Lokesh : టీడీపీ వల్లనే బీసీలకు రాజకీయ, ఆర్ధిక స్వాతంత్య్రం : నారా లోకేష్
ఇప్పటికైన నారా లోకేశ్ తన తీరు మార్చుకోవాలి. ఇష్టమొచ్చినట్లు ఆరోపణలు చేస్తే ఎలా భరిస్తాం అంటూ లోకేశ్‌ను కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ ప్రశ్నించారు. ఇదిలాఉంటే, నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర కర్నూల్ జిల్లాలో కొనసాగుతోంది. సోమవారం ఉదయం ఎస్‌టీబీసీ గ్రౌండ్ విడిది కేంద్రం నుంచి లోకేశ్ పాదయాత్రను ప్రారంభించారు.