Nara Lokesh : టీడీపీ వల్లనే బీసీలకు రాజకీయ, ఆర్ధిక స్వాతంత్య్రం : నారా లోకేష్

10 శాతం రిజర్వేషన్లు కట్ చేసి స్థానిక సంస్థల్లో 16,500 మంది బీసీలకు పదవులు దక్కకుండా జగన్ రెడ్డి చేశారని విమర్శించారు. బీసీ నాయకత్వాన్ని దెబ్బతీయడానికి జగన్ ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతుందన్నారు.

Nara Lokesh : టీడీపీ వల్లనే బీసీలకు రాజకీయ, ఆర్ధిక స్వాతంత్య్రం : నారా లోకేష్

Nara Lokesh

Nara Lokesh : టీడీపీ వల్లనే బీసీలకు రాజకీయ, ఆర్ధిక స్వాతంత్య్రం వచ్చిందని టీడీపీ నేత నారా లోకేష్ తెలిపారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు బీసీలకు పెద్ద పీట వేశారని పేర్కొన్నారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించింది టీడీపీయేనని స్పష్టం చేశారు. ఆదరణ పథకం ద్వారా పనిముట్లు అందించామని తెలిపారు. టీడీపీ హయాంలో ఆర్ధిక శాఖ, టీటీడీ, తుడా ఛైర్మెన్ లాంటి కీలక పదవులు బీసీలకు ఇచ్చామని గుర్తు చేశారు. ‘మీరు పాలిచ్చే ఆవుని వద్దనుకుని తన్నే దున్నపోతుని తెచ్చుకున్నారు’ అని పేర్కొన్నారు. జగన్ పాలనలో నిధులు లేని కార్పొరేషన్లు ఏర్పాటు చేశారని ఎద్దేవా చేశారు.

10 శాతం రిజర్వేషన్లు కట్ చేసి స్థానిక సంస్థల్లో 16,500 మంది బీసీలకు పదవులు దక్కకుండా జగన్ రెడ్డి చేశారని విమర్శించారు. బీసీ నాయకత్వాన్ని దెబ్బతీయడానికి జగన్ ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతుందన్నారు. ప్రజా సమస్యలు పరిష్కారించాలని అడిగితే బెంజ్ మంత్రి బీసీలపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆరోపించారు. బెంజ్ మంత్రి వాల్మీకిలకు చేసింది ఎంటి? ఆయన బెంజ్ కారులో తిరుగుతున్నారని.. ఇక్కడ ఉన్న వాల్మీకిలకు చిన్న కారు కొనుక్కునే స్థితిలో అయినా ఉన్నారా? అని నిలదీశారు.

Nara Lokesh: జగన్ రెడ్డి రివర్స్ పాలనలో బాధితుల పైనే కేసులు, వేధింపులు: నారా లోకేష్

బెంజ్ మంత్రి వందల ఎకరాలకు అధిపతి అయ్యారు.. ఇక్కడ ఉన్న వాల్మీకీలు ఒక్క ఎకరం భూమి కొనుగోలు చేసే పరిస్థితి ఉందా? ప్రశ్నించారు. ఇటినా భూములుపై ఛాలెంజ్ చేశానని.. ప్రభుత్వ ధర చెల్లిస్తే భూములు రైతులకు రాసిస్తా అని బెంజ్ మంత్రి అన్నారని తెలిపారు. ఆ డబ్బులు తాము చెల్లిస్తామని చెప్పానని ఆ భూములు రైతుల పేరిట రాయడానికి బెంజ్ మంత్రి సిద్ధమా అని అడిగారు. వాల్మీకీలను ఎస్టీల్లో చేర్చేందుకు టీడీపీ సత్యపాల్ కమిటీ వేశాం, అసెంబ్లీ లో తీర్మానం చేసి కేంద్రానికి పంపామని తెలిపారు. నాలుగేళ్లు డ్రామా చేసిన జగన్ ఇప్పుడు బోయ, వాల్మీకీలను ఎస్టీల్లో చేరుస్తామని కొత్త తీర్మానం అంటున్నాడని మండిపడ్డారు.

వాల్మీకీలకు ఇచ్చిన హామీకి టీడీపీ కట్టుబడి ఉందన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే మిమ్మల్ని ఎస్టీల్లో చేర్చేందుకు కేంద్రంతో పోరాడతామని చెప్పారు. బీసీలను జగన్ ప్రభుత్వం వేధిస్తుందని.. బీసీలపై సుమారుగా 26 వేల కేసులు పెట్టారని తెలిపారు. అందుకే ప్రత్యేక బీసీ రక్షణ చట్టం తీసుకొస్తామని చెప్పారు. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో నారా లోకేష్ యువగళం పాదయాత్ర కొనసాగుతోంది. ఈ సందర్భంగా బీసీ ప్రతినిధులతో నారా లోకేష్ భేటీ అయ్యారు.  బీసీల్లో ఉన్న ఉపకులాలకు దామాషా ప్రకారం నిధులు కేటాయిస్తామన్నారు.

Nara Lokesh: ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి అవినీతిలో తోపు: నారా లోకేశ్

స్వయం ఉపాధి కోసం కార్పొరేషన్ల ద్వారా నిధులు మంజూరు చేస్తామని వెల్లడించారు.  బీసీలను పారిశ్రామికవేత్తలుగా మార్చేందుకు నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసే ఇండస్ట్రియల్ క్లస్టర్లలో బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తామని హామీ ఇచ్చారు. సొంత మద్యం వ్యాపారం కోసం జగన్ కల్లు గీత కార్మికులను వేధిస్తున్నారని విమర్శించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే నీరా కేఫ్ లు ప్రారంభిస్తామని చెప్పారు.  మద్యం దుకాణాల్లో కల్లు గీత కార్మికులకు రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పారు.

టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే పనిముట్లు అందిస్తామని, చెట్ల పెంపకం కోసం సహాయం, భీమా కల్పిస్తామని తెలిపారు. వడ్డెర్ల కోసం ఫెడరేషన్ ఏర్పాటు చేసింది టీడీపీయేనని స్పష్టం చేశారు. వడెర్ల కోసం టీడీపీ మైన్లు కేటాయిస్తే.. ఆ మైన్లను వైసీపీ నాయకులు లాక్కున్నారని విమర్శించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఎవరి మైన్లు వారికి తిరిగి కేటాయిస్తామని చెప్పారు. బడుగు, బలహీన వర్గాలను జగన్ ప్రభుత్వం విద్యకు దూరం చేస్తుందని ఆరోపించారు. ఫీజు రీయింబర్స్ మెంట్, విదేశీ విద్య, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పథకాలను జగన్ నిర్వీర్యం చేశారు.

TDP Lokesh Padayatra : ఏపీలో మద్య పాన నిషేధం జరిగిందా? నారా లోకేశ్

టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యార్థులు, తల్లిదండ్రులపై ఒత్తిడి లేకుండా నేరుగా కాలేజీలకు ఫీజులు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. పదో తరగతి ఫెయిల్ అయిన జగన్ కి క్రీడల విలువ ఏమి తెలుస్తుందని ఎద్దేవా చేశారు. రాయలసీమకి స్పోర్ట్స్ యునివర్సిటీ తీసుకొస్తామని చెప్పారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే బీసీలకు శాశ్వత కుల ధృవీకరణ పత్రాలు అందజేస్తామని చెప్పారు. బీరప్ప దేవాలయాల నిర్మాణం కోసం ప్రభుత్వం ద్వారా సహాయం చేస్తామని.. అలాగే పూజారులకు గౌరవ వేతనం ఇచ్చి ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.

కురబ సామాజిక వర్గం కోసం టీడీపీ హయాంలో గొర్రెలు కొనడానికి రుణాలు అందించామని తెలిపారు. మందులు, మేత, దాణా రేట్లు విపరీతంగా పెరిగిపోయాయని తెలిపారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సబ్సిడీలో మందులు, మేత, దాణా అందజేస్తాం, ఇన్స్యూరెన్స్ సదుపాయం కల్పిస్తామని స్పష్టం చేశారు. డప్పు కళాకారులని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. బీసీ భవనాలు, కమ్యూనిటీ భవనాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. యాదవ సామాజిక వర్గాన్ని ఆదుకున్నది టీడీపీయేనని స్పష్టం చేశారు. వైసీపీ యాదవ కార్పొరేషన్ ని నిర్వీర్యం చేసిందని విమర్శించారు.