Nara Lokesh: జగన్ రెడ్డి రివర్స్ పాలనలో బాధితుల పైనే కేసులు, వేధింపులు: నారా లోకేష్

ఆర్ఐ అరవింద్ పై పోలీస్ కేసు నమోదు కావడం, గుడివాడలో ఇసుక మాఫియా రెచ్చిపోవడం పై ప్రతిపక్ష టీడీపీ నేత నారా లోకేష్ ఆందోళన వ్యక్తం చేశారు

Nara Lokesh: జగన్ రెడ్డి రివర్స్ పాలనలో బాధితుల పైనే కేసులు, వేధింపులు: నారా లోకేష్

Loki

Nara Lokesh: కృష్ణాజిల్లా గుడివాడ మండలంలో ఇసుక మాఫియాను అడ్డుకున్న రెవిన్యూ ఇన్స్పెక్టర్ అరవింద్ పై బుధవారం పోలీస్ కేసు నమోదు అయింది. మండలంలోని మోటూరు గ్రామంలో అర్ధరాత్రి వేళ జరిపిన ఇసుక తవ్వకాల సమయంలో ఆర్ఐ అరవింద్, అతని సిబ్బంది లంచం డిమాండ్ చేశారంటూ గంటా లక్ష్మణరావు అనే వ్యక్తి గుడివాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే పనులు ఆపమన్నందుకు గంటా లక్ష్మణరావు తనపై దాడి చేశాడంటూ గతంలోనే ఆర్ఐ అరవింద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదిలాఉంటే..ప్రభుత్వ అధికారిపైనే ఇసుక మాఫియా సభ్యులు పోలీసులు కేసులు పెడుతున్నారంటూ ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

Also Read:TRS Plenary : కేంద్ర సర్కార్‌‌పై కేటీఆర్ నిప్పులు.. ప్లీనరీలో పవర్ ఫుల్ స్పీచ్

ఆర్ఐ అరవింద్ పై పోలీస్ కేసు నమోదు కావడం, గుడివాడలో ఇసుక మాఫియా రెచ్చిపోవడం పై ప్రతిపక్ష టీడీపీ నేత నారా లోకేష్ ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం స్పందించిన నారా లోకేష్, జగన్ రెడ్డి రివర్స్ పాలనలో బాధితులపైనే కేసులు, వేధింపులు జరుగుతున్నాయంటూ ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గుడివాడ మండలంలోని మోటూరు గ్రామంలో మట్టి అక్రమ రవాణాని అడ్డుకున్నారనే అక్కసుతో రెవిన్యూ సిబ్బంది పై దాడికి పాల్పడటమే కాకుండా ఇప్పుడు ఏకంగా ఆర్ఐ అరవింద్ పై “అర్ధరాత్రి లంచం డిమాండ్ చేసారని” కేసు పెట్టడం వైసీపీ మైనింగ్ మాఫియా అరాచకాలకు అద్దంపడుతుందని లోకేష్ విమర్శించారు.

Also read:Bonda Uma: మహిళలకు భద్రత కల్పించాలంటూ బోండా ఉమ ధర్నా

వైసీపీ నాయకుల ప్రలోభాలకు లొంగకుండా నిజాయితీగా పనిచేసే అధికారుల మనోధైర్యాన్ని దెబ్బతియ్యడమే లక్ష్యంగా ఇటువంటి అక్రమ కేసులు బనాయిస్తున్నారంటూ నారా లోకేష్ అధికార పార్టీపై మండిపడ్డారు. ప్రభుత్వ అధికారులను బెదిరించడానికి పెడుతున్న అక్రమ కేసుల విషయంలో మరోసారి కోర్టులో జగన్ ప్రభుత్వం మొట్టికాయలు తినడం ఖాయమంటూ లోకేష్ చురకలంటించారు. వైసీపీ నిరంకుశ పాలన, అక్రమాలకు ఎదురొడ్డి పోరాడుతున్న ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఎప్పుడూ టీడీపీ మద్దతు ఉంటుందని నారా లోకేష్ చెప్పారు.

Also read:Rajath kumar: తెలంగాణ నీటిని ఏపీ వాడుకుంటోంది: రజత్ కుమార్