TRS Plenary : కేంద్ర సర్కార్‌‌పై కేటీఆర్ నిప్పులు.. ప్లీనరీలో పవర్ ఫుల్ స్పీచ్

జాతీయ రాజకీయాల్లో టీఆర్ఎస్ కీలక పాత్ర పోషించాలంటూ తీర్మానం ప్రవేశపెట్టారు కేటీఆర్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నో ప్రయత్నాలు చేసినా కేవలం ఇద్దరు ఇద్దరే మహానుభావులు మాత్రమే చరిత్రలో ఉండిపోయారని...

TRS Plenary : కేంద్ర సర్కార్‌‌పై కేటీఆర్ నిప్పులు.. ప్లీనరీలో పవర్ ఫుల్ స్పీచ్

Ktr speech

TRS Working President KTR Power Full Speech : తెలంగాణ రాష్ట్ర మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. టీఆర్ఎస్ ప్లీనరీ వేదికగా ఆయన కేంద్ర ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించారు. పవర్ ఫుల్ స్పీచ్ తో అదరగొట్టారు. ఆయన ప్రసంగానికి సభికుల నుంచి విశేష స్పందన వచ్చింది. ‘ప్రభుత్వ సంస్థలను అమ్ముతున్నారు..ఉన్న ఉద్యోగాలను ఊడగొడుతున్నారు.. మాట్లాడితే ఒకల్ ఫర్ లోకల్ మోదీ అంటారు..కాళేశ్వరం ప్రాజెక్టును ఎందుకు ప్రశసించడం లేదు..రూ. 70 నుంచి పెట్రోల్ రూ.120 ఎందుకైంది ? బల్లెట్ రైళ్లు అన్న మోదీ ఉన్న రైళ్లను అమ్ముతున్నారు.. ఆత్మ నిర్భర్ అంటున్నారు.. కానీ ఉన్న నిబ్బరం పోగొడుతున్నారు.. డబుల్ ఇంజిన్ అంటే రైతుల కష్టాలు డబుల్, పెట్రో రేట్లు డబుల్, గ్యాస్ ధర డబుల్, ఎరువులు డబుల్, నిత్యాసవసరాలు డబుల్, డబుల్ ఇంజిన్ అంటే అరాచకాలు, మతపిచ్చి డబుల్, బీజేపీ చేతిలో అధికారం దేశానికే అంధకారం’ అంటూ విమర్శలు గుప్పించారు.

Read More : TRS Plenary : టీఆర్ఎస్ ఫ్లెక్సీల ఏర్పాటుపై కేఏ పాల్ పిటిషన్

హైద‌రాబాద్‌ హెచ్‌ఐసీసీలో టీఆర్ఎస్‌ 21వ ఆవిర్భావ వేడుకలు జరుగుతున్న సంగతి తెలిసిందే. జాతీయ రాజకీయాల్లో టీఆర్ఎస్ కీలక పాత్ర పోషించాలంటూ తీర్మానం ప్రవేశపెట్టారు కేటీఆర్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నో ప్రయత్నాలు చేసినా కేవలం ఇద్దరు ఇద్దరే మహానుభావులు మాత్రమే చరిత్రలో ఉండిపోయారని, ఒకరు స్వర్గీయ నందమూరి తారకరామరావు అయితే.. మరోకరు కేసీఆర్ అని చెప్పారు. కేసీఆర్ హిస్టరీతో పాటు జాగ్రఫీని క్రియేట్ చేశారని కొనియాడారు. రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు ఉంటారని.. కానీ.. రాష్ట్రాన్ని తెచ్చిన ముఖ్యమంత్రి ఇక్కడ ఉన్నారని తెలిపారు. అప్పుడు రాష్ట్రపతిగా ఉన్న స్వర్గీయ ప్రణబ్ ముఖర్జీని కలిసిన సమయంలో.. కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారని గుర్తు చేశారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత.. చావు నోట్లో తలపెట్టి తెచ్చారో.. నాయకుడికి అవకాశం ఇచ్చారన్నారు. కేసీఆర్ చాలా కీలక వ్యక్తి అని.. స్వర్గీయ అరుణ్ జైట్లీ చెప్పారని, భారతదేశానికి ఒక దిక్యూచీగా మార్చిన ఘనత కేసీఆర్ కు దక్కుతుందన్నారు. అభివృద్ధిని, సంక్షేమాన్ని జోడించి.. సకల జనుల అభ్యున్నతే ధ్యేయంగా తెలంగాణ దూసుకపోతోందన్నారు. 75 ఏళ్లలో ఎంతో రైతు బంధు పథకం ప్రవేశపెట్టిన తర్వాత.. కేంద్ర ప్రభుత్వానికి ప్రేరణ అయ్యిందన్నారు. మిషన్ భగీరథను కేంద్రం కాపీ కొట్టి హర్ ఘర్ కో జల్ అంటూ తీసుకొచ్చాని, టీఎస్ ఐపాస్ ను కూడా కాపీ కొట్టిందన్నారు. ఆరు నెలల్లోనే వ్యవసాయానికి 24 గంటలు నాణ్యమైన కరెంటు ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ అన్నారు.

Read More : TRS Plenary : సంపద పెంచాలి.. పేదలకు పంచాలన్నదే కేసీఆర్ లక్ష్యం : హరీశ్ రావు

అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అయిన కాళేశ్వరం రూపొందించిన ఘనత కేసీఆర్ కు దక్కుతుందన్నారు. దీనిని ప్రధాన మంత్రి మోదీ ఎందుకు ప్రశంసించరని సూటిగా ప్రశ్నించారు. నాలుగేళ్లలో ఫ్లోరిసిస్ ను సమస్యను పరిష్కరించారని, జనహితమే మనమతమే ధ్యేయంగా దూసుకపోతోందని తెలిపారు కరెంటు, నీళ్లు, వ్యవసాయంలో సమృద్ధి కావాలని.. దేశానికి దార్శనికుడు కావాలన్నారు. దేశ ప్రజల బాగు చేసే విజన్ ఉన్న నాయకుడు ఉండాలని, మతం, కులం పిచ్చి లేని, పేద వాడి కళ్లల్లో ఆనందం చూడాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళుతోందన్నారు. 2011-14 వరకు ఊదరగొట్టి దేశ ప్రజలను ఆగమాగం చేశారని, అంతులేని వైఫల్యాల చరిత్ర కేంద్రానిదన్నారు. 2022 సంవత్సరానికల్లా.. రైతుల ఆదాయాన్ని డబుల్ చేస్తామని 2014లో ప్రధాని మోదీ చెప్పారని.. కానీ అలాంటి పరిస్థితి రాలేదన్నారు. నల్లచట్టాలు తెచ్చి.. రైతుల నడ్డి విరిచిందని..నరేంద్ర మోదీ రైతు విరోధి అంటూ రైతులు విమర్శిస్తున్నారని తెలిపారు.

Read More : TRS 21st Plenary : టీఆర్ఎస్ 21వ ప్లీనరీలో ఆమోదం తెలుపనున్న తీర్మానాలు…

ప్రతి పేదవాడికి ఇళ్లు తెస్తామని చెప్పి.. మోసం చేశారని విమర్శించారు. దివాళా కోరు విధానాల ద్వారా..దేశాన్ని భ్రష్టు పట్టించారని, నల్లధనం అంటే బిక్కమొహం వేస్తున్నారని ఎద్దేవా చేశారు. రెండు కోట్ల ఉద్యోగాల మాటేంటని సూటిగా ప్రశ్నించారు. ఉన్న ఉద్యోగాలు ఊడగొడుతూ.. ప్రభుత్వ సంస్థలను అమ్ముతున్నారని కేటీఆర్ వెల్లడించారు. రైతుల రుణమాఫీ చేయడం లేదని.. కార్పొరేట్ దోస్తులకు మాఫీ చేస్తున్నారని..విధ్వేషం చెలరేగుతుంటే కళ్లు మూసుకుంటున్నారని పేర్కొన్నారు. గాంధీని దూషిస్తుంటే.. మౌనంగా ఉంటూ.. పరోక్షంగా మద్దతిస్తున్నారని.. ఎన్నికలు రాగానే పాక్ ను తిడుతుంటారని తెలిపారు. అతిగర్వంతో అమెరికా ఎన్నికల విషయంలో జోక్యం చేసుకున్నారని.. అక్కడ ఏమి జరిగిందో అందరికీ తెలిసిందేనని ఎద్దేవా చేశారు. భారతదేశానికి ఒక మంచి విజన్ ఉన్న నాయకుడిని తెలంగాణ అందిస్తుందని తాను కూడా ఆశిస్తున్నట్లు తెలిపారు. ఉద్వేగాల భారతం వద్దని.. ఉద్యోగ భారత్ రావాలని ప్రజలు కోరుకుంటున్నట్లు కేటీఆర్ వెల్లడించారు.