TRS Plenary : టీఆర్ఎస్ ఫ్లెక్సీల ఏర్పాటుపై కేఏ పాల్ పిటిషన్

పార్టీ ప్లీనరీ కోసం సిటీ వ్యాప్తంగా ఫ్లెక్సీలు కట్టడంపై పిటిషన్ లో ప్రశ్నించారు. తెలంగాణ ప్రిన్సిపల్ సెక్రటరీ, GHMC కమిషనర్ లను ప్రతివాదులుగా చేర్చారాయన. ఫ్లెక్సీలు పెట్టొద్దని...

TRS Plenary : టీఆర్ఎస్ ఫ్లెక్సీల ఏర్పాటుపై కేఏ పాల్ పిటిషన్

Trs And Ka Paul

KA Paul Petition : టీఆర్ఎస్‌ 21వ ఆవిర్భావ వేడుకలు అట్టహాసంగా కొనసాగుతున్నాయి. HICC వేదికగా ప్లీనరీ జరుగుతోంది. ప్లీనరీకి ఆహ్వానం అందిన 3 వేల మంది ప్రతినిధులు హాజరయ్యారు. వీరికి బార్ కోడ్ తో ఐడీ కార్డులు, వాహనాలకు ప్రత్యేకంగా పాస్ లను జారీ చేసింది. పార్టీ ఆవిర్భావం సందర్భంగా నగరంలో భారీ స్థాయిలో ఫ్లెక్సీలు, జెండాలను ఏర్పాటు చేసింది. ఎక్కడ చూసినా గులాబీ జెండాలు దర్శనమిస్తున్నాయి. దీనిపై ప్రజాశాంతి పార్టీ ఫౌండర్ కేఏ పాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పార్టీ ప్లీనరీ కోసం సిటీ వ్యాప్తంగా ఫ్లెక్సీలు కట్టడంపై పిటిషన్ లో ప్రశ్నించారు. తెలంగాణ ప్రిన్సిపల్ సెక్రటరీ, GHMC కమిషనర్ లను ప్రతివాదులుగా చేర్చారాయన. ఫ్లెక్సీలు పెట్టొద్దని ప్రభుత్వంలో గతంలో చెప్పిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. అయినా.. నేతలు, కార్యకర్తలు భారీగా ప్లేక్సీలు ఏర్పాటు చేశారని, రూల్స్ కి విరుద్ధంగా వ్యవహరించారని పిటిషన్ లో వెల్లడించారు. సిటీ అంతా ఫ్లెక్సీలే ఉన్నాయని వాటిపై చర్యలు తీసుకోవాలని కోరారు.

Read More : TRS Plenary : సంపద పెంచాలి.. పేదలకు పంచాలన్నదే కేసీఆర్ లక్ష్యం : హరీశ్ రావు

క్లాసిఫైడ్స్ తో ప్రచారం చేస్కోవడం తప్పు కాదని, కానీ రోడ్డు మధ్యలో ఫ్లెక్సీలు పెట్టడం తప్పని కేఏ పాల్ అభిప్రాయం వ్యక్తం చేశారు. మరోవైపు టీఆర్ఎస్‌ 21వ ఆవిర్భావ వేడుకలు కొనసాగుతున్నాయి. హెచ్‌ఐసీసీలో ఉద‌యం11 గంట‌ల‌కు పార్టీ ప‌తాకాన్ని ఆవిష్కరించారు సీఎం కేసీఆర్. సాయంత్రం 5 గంటల వరకు ప్లీనరీ జరగనుంది. 11 తీర్మానాలకు ప్లీనరీ ఆమోదం తెలపనుంది. దేశంలోని దిగువ, మధ్య తరగతి పేదల గుండె చప్పుడు విన్పించే విధంగా పార్టీ విధానాలను, తీర్మానాలను రూపొందించామన్నారు మంత్రి కేటీఆర్‌. దేశ రాజకీయ వ్యవస్థ, కేంద్రంపై తమ పార్టీ వైఖరిని వెల్లడిస్తామన్నారు.

Read More : CM KCR : దుర్మార్గమైన విధానాలు దేశానికి అశనిపాతంలా దాపురించాయి : సీఎం కేసీఆర్

ఇక అన్ని రాష్ట్రాల్లో టీఆర్ఎస్ 21వ ఆవిర్భావ దినోత్సవ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో 12 వేల‌కు పైగా గ్రామాలు, 3 వేల‌కు పైగా వార్డుల ప‌రిధిలో జెండాలు ఎగ‌ర‌వేశారు. ఇక గుజరాత్, మహారాష్ట్ర, ఒడిశా, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, కర్నాటక, తమిళనాడు తదితర రాష్ట్రాల్లో .. దేశ్ కీ నేతా కేసీఆర్‌ అని కీర్తిస్తూ ఫ్లెక్సీలు, బ్యానర్లు, హోర్డింగులను ఏర్పాటు చేశారు. ప్లీనరీ కోసం పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. టీఆర్ఎస్ ప్లీనరీలో 33 ర‌కాల వంటకాలతో మోనూను సిద్ధం చేశారు. నోరూరించే తెలంగాణ వంటకాలతో పాటు ఇతర ఐటెమ్స్‌ను కూడా రెడీ చేశారు. వెజ్, నాన్‌వెజ్, ధమ్‌ బిర్యానీ, నాటుకోడి కూర, మటన్, బోటీ దాల్చా, స్వీట్లు, ఐస్‌క్రీమ్స్, పచ్చిపులుసు ఇంకా మరిన్ని వంటకాలను వడ్డించనున్నారు.