CM KCR : దుర్మార్గమైన విధానాలు దేశానికి అశనిపాతంలా దాపురించాయి : సీఎం కేసీఆర్

ప్రజలు ఎందుకు చీకట్లో మగ్గాలి? ఇది భారతీయుల ఖర్మానా? దేశంలో 65వేల టీఎంసీల నీరు నదుల్లో అందుబాటులో ఉందన్నారు. అయినా ప్రజలు మంచినీరు, సాగు నీటి కోసం ఎందుకు అల్లాడుతున్నారని ప్రశ్నించారు.

CM KCR : దుర్మార్గమైన విధానాలు దేశానికి అశనిపాతంలా దాపురించాయి : సీఎం కేసీఆర్

Kcr (1)

CM KCR : దేశంలో పెడధోరణలు పెరుగుతున్నాయని సీఎం కేసీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. సమాజానికి శ్రేయస్కరం కాని ధోరణలు ప్రబలుతున్నాయని తెలిపారు. దుర్మార్గమైన విధానాలు దేశానికి అశనిపాతంలా దాపురించాయని విమర్శించారు. 4.01లక్షల మెగావాట్ల విద్యుత్ దేశంలో అందుబాటులో ఉందన్నారు. ఏ రోజూ 2లక్షల మెగావాట్లకు మించి దేశం వినియోగించడం లేదని చెప్పారు. గుజరాత్ లోనూ భరించలేని కరెంటు కోతలు, రైతుల రాస్తారోకోలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. మన సరిహద్దుల్లో కోతలు లేని రాష్ట్రాలు ఉన్నాయా అని అన్నారు. చుట్టూ అంధకారం ఉంటే, తెలంగాణ మాత్రం మణిదీపంలా వెలుగుతుందన్నారు. తెలంగాణలా కేంద్రం కూడా పనిచేసి ఉంటే ఇవాళ దేశంలో కరెంటు కోతలు ఉండేవి కాదన్నారు.

ప్రజలు ఎందుకు చీకట్లో మగ్గాలి? ఇది భారతీయుల ఖర్మానా? దేశంలో 65వేల టీఎంసీల నీరు నదుల్లో అందుబాటులో ఉందన్నారు. అయినా ప్రజలు మంచినీరు, సాగు నీటి కోసం ఎందుకు అల్లాడుతున్నారని ప్రశ్నించారు. కావేరీ జలాల కోసం తమిళనాడు, కర్నాటక గొడవ పడుతున్నాయంటే అందుకు కారకులెవరన్నారు. కనీసం తాగునీటికి నోచుకోదా నా భారతదేశం అని ఆవేదన వ్యక్తం చేశారు. అత్యధిక యువశక్తి కలిగిన దేశం నా భారతదేశం అని అన్నారు. 13 కోట్ల మంది భారతీయులు విదేశాల్లో వారి ప్రతిభాపాటవాలను ఖర్చు చేస్తున్నారని తెలిపారు.
CM KCR : దేశానికే ఆదర్శంగా తెలంగాణ : సీఎం కేసీఆర్

అమెరికా గ్రీన్ కార్డు కోసం మన భారతీయులు ఎందుకు పోటీ పడుతున్నారని పేర్కొన్నారు. మనకు భూమి లేకనా?.. వనరులు లేకనా? ఎందుకు భారతదేశం కునారిల్లుతోందని పేర్కొన్నారు. రాజకీయ రణగొణ, ధ్వనులు, మైకులు పగిలిపోయే ఉపన్యాసాలతో భరతమాత జీవితం 75ఏళ్లు గడిచిందని తెలిపారు. ఊకదంపుడు ఉపన్యాసాలు, రాజకీయాలతో అబ్భుత ఫలితాలు రావని స్పష్టం చేశారు. మేధోమథనం జరగాలి, ఆలోచనలకు కార్యరూపం ఇవ్వాలన్నారు. అన్ని మనకు తెలుసనే అహంకారం వీడాలని సూచించారు. ప్రజా సలహాలు, సూచనలు తీసుకోవాలని చెప్పారు.